Viral Video : కుక్కను ముప్పుతిప్పలు పెడుతూ.. చుక్కలు చూపిస్తున్న కొండెంగ.. ఎందుకంటే?
Viral Video : కోతిని మించిన వింత చేష్టలు కొండెంగలు చేస్తుంటాయి. అందుకే కొండెంగలతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. కాగా, కొండెంగకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వైరల్ వీడియోలో కొండెంగ కుక్కను ముప్పుతిప్పలు పెడుతోంది.పగబట్టిన మాదిరిగా కుక్కను కొండెంగ టార్గెట్ చేసి మరీ చుక్కలు చూపిస్తోంది. లవ్ లీ యానిమల్స్ లవ్ లీ అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ హోల్డర్ షేర్ చేసిన వీడియోలో కొండెంగ పెట్ డాగ్ ఒకదానిని అరిగోస పెడుతోంది.
సదరు వీడియోలో బుల్లి కొండెంగ.. మనిషి మాదిరిగా వేషం వేసుకుని ఉంది. అలా కుక్కను చూసి దాని మీదకు వెళ్తుండగా కుక్క అటు ఇటు వెళ్తున్నది.ఈ క్రమంలోనే కొండెంగ కుక్కను వెండిస్తూ ఇబ్బందులు పెడుతోంది. కుక్క బౌ..బౌ..అని అరుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా కొండెంగ దాని తోకను పట్టుకుని వేలాడుతోంది. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు పాపం కుక్క..అని అంటున్నారు.

monkey dog video viral in social media
Viral Video : అలా తొక పట్టుకుని, వదిలేస్తూ.. కుక్కను ఇరిటేట్ చేస్తున్న కొండెంగ..
ఇటువంటి కొండెంగలు వెరీ ఫన్నీ అని ఇంకొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇలా కుక్కలను కొండెంగలు ఆటపట్టించడం ఇదే కొత్త అని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే, కొండెంగ, కుక్కలకు అస్సలు పడదని కూడా పెద్దలు చెప్తుంటారు. ఇక ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు కొందరు నవ్వుకుంటున్నారు.
View this post on Instagram