Viral Video : ఇది మామూలు కోతి కాదు.. బ్రిడ్జి పల్లర్స్ పై కోతి జంపింగ్స్ అదుర్స్
Viral Video : సోషల్ మీడియాలో కోతులకు సంబందించిన వీడియోలు లక్షల్లో ఉంటాయి. అవి చేసే పనులు ఇతర జంతువులతో చేసే స్నేహం వంటి వీడియోలు కోకొల్లలుగా ఉంటాయి. కోతికి కోతి చేష్టలు కాకమరేముంటాయి. ఎక్కడ ఏది కనిపించినా దానిని కలబెట్టి. విడగొట్టి వాసన చూసి అక్కడ నుంచి పరుగులు పెట్టడడమే దాని పని. దీని వలన ఎవరికి ఏ నష్టమొచ్చినా.. కష్టమొచ్చినా దాంతో పని లేదు. కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. ఇళ్లలో దూరి.. మనుషుల దగ్గర నుంచి వస్తువులు లాక్కేళ్లే అలవాటు బహుశా కోతికి మాత్రమే ఉందనుకుంటా.
కోతి చేష్టలు చాలా సార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి.కోతి చేష్టలు కూడా అచ్చం మనిషిని పోలి ఉంటాయి. వాటి చేష్టలు, అల్లరి, ఆలోచన విధానం, మానవత్వం, సాయం చేసే గుణం ఇలా ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటాయి. కోతులు సాధారణంగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి అవలీలగా దూకేస్తుంటాయి. అయ్యో పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ అది తప్పించుకుంటుంది.
సన్నని కొమ్మ సాయంతో దూకేస్తుంది.. గోడలపై నుంచి ఇళ్లపైకి దూకేస్తుంటాయి.. పెద్ద పెద్ రాతి గుట్టలపై తిరుగుతుంటాయి. రకరకాలుగా అనేక సహసాలు చేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం వైరల్ అవతోంది.అయితే ఓ కోతి బ్రిడ్జిపై నుంచి రెండు కాళ్లతో వేగంగా నడుస్తూ బ్రిడ్జిపై ఉన్న చిన్న చిన్న పిల్లర్లపైకి దూకింది. అలా ఒక పిల్లర్ పై నుంచి మరో పిల్లర్ పై జంప్ చేస్తూ స్పీడ్ గా వెళ్తోంది. దీంతో కోతి సహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
https://twitter.com/susantananda3/status/1514268305334616064