Viral Video : పరిగెత్తే తాబేలును చూశారా.. ఈ తాబేలు స్పీడ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. వీడియో
Viral Video : తాబేలు గురించి తెలుసు కదా. అవి చాలా స్లో. ఎంత స్లో అంటే.. అవి ఒక్క స్టెప్ ముందుకేసి చాలా సేపు అలాగే ఉండిపోతాయి. వాటికి నడవడం కూడా చాలా కష్టం. అందుకే.. తాబేలుతో పోటీ అంటే ఇక అయినట్టే అంటారు. పురాణాల్లో తాబేలు, కుందేలు పోటీని కూడా అందుకే పెట్టారు. నిజానికి ఆ కథలో తాబేలు గెలిచినప్పటికీ.. అది కేవలం కుందేలు తప్పిదం వల్ల తాబేలు గెలుస్తుంది.తాబేలు.. నీటిలో, నేల మీద బతకగలదు. వాటికి ఆ సత్తా ఉంటుంది.
అలాగే.. తాబేళ్లకు ఎక్కువ ఆయుష్షు ఉంటుంది. అవి కనీసం వెయ్యి ఏళ్ల వరకు ఎటువంటి సమస్య లేకుండా జీవించగలవు. వాటి మీద ఉండే పెద్ద డొప్ప.. వాటికి రక్షణగా ఉంటుంది. తాబేలు నడవడం చూశాం కానీ.. ఇలా పరిగెత్తడం మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటారు కదా. అవును.. తాబేలు పరిగెత్తడం కష్టం. అవి అసలు పరిగెత్తలేవు. నడవడానికే అవి చాలా ఇబ్బంది పడుతుంటాయి. కానీ.. ఇప్పుడు మీరు వీడియోలో చూడబోయే తాబేలు మాత్రం నింజాలా పరిగెడుతుంది.

ninja turtle playing video viral
Viral Video : నింజాలా స్కేటింగ్ చేస్తున్న తాబేలు
సాధారణంగా పిల్లలు స్కేటింగ్ చేస్తూ ఎలా పరిగెడతారో.. ఈ తాబేలు కూడా తన కింద స్కేటింగ్ పరికరాన్ని పెట్టుకొని స్పీడ్ గా పరిగెత్తింది. తాబేలు స్పీడ్ గా పరిగెత్తే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో తాబేళ్లకు ఇంత టాలెంట్ ఉంటుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
Ninja turtle ???? ???? pic.twitter.com/6sl6pvPTvU
— CCTV_IDIOTS (@cctv_idiots) February 26, 2022