Saranga Dariya : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన సినిమా “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమా వాస్తవానికి 2020 ఏప్రిల్ 2వ తారీఖు విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ అదే సమయానికి ఒక్కసారిగా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్ డౌన్
ప్రకటించడంతో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. ఈ పరిణామంతో 2021 సెప్టెంబర్ 24వ తారీకు “లవ్ స్టోరీ” రిలీజ్ చేయడం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి “సారంగదీయ” సాంగ్ కి వేసిన స్టెప్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. “సారంగదీయ” సాంగ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ పాటకి సాయి పల్లవి

వేసిన స్టెప్పులు పట్ల ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఇదే పాటతో ఒక స్కూల్ టీచర్… పిల్లలకు పాఠాలు తెలియజేసింది. భారత చిత్రపటం చూపిస్తూ చుట్టుపక్కల సరిహద్దు దేశాలు గురించి పిల్లలకి బోధిస్తూ… ఈ పాట ద్వారా కుడి భుజం వైపు ఎడమ భుజం వైపు… ప్రాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.