Viral Video : ఈ వీడియో చూస్తే మీ ఒళ్లు జలదరిస్తుంది.. వట్టి చేతులతోనే బారీ పామును పట్టేశాడు..
Viral Video : సోషల్ మీడియాలో జంతువులు, సరీ సృపాలకు సంబంధించిన బోలెడన్ని వీడియోలు వైరలవుతుండటం మనం చూడొచ్చు. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను తన వట్టి చేతులతోనే పట్టేశాడు. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ జరిగిందంటే..జనరల్ గా దాదాపుగా ఎవరైనా సరే పామును చూడగానే భయపడిపోతుంటారు. దానిని దేవుడని పూజిస్తుంటాం. కానీ, మన పరిసర ప్రాంతాల్లో కనబడితే మాత్రం భయపడిపోతుంటాం. ఈ సంగతి అలా ఉంచితే.. ఇటీవల థాయ్ లాండ్ లోకి ఓ భారీ పాము వచ్చేసింది. దాంతో అక్కడున్న స్థానికులు భయపడిపోయి పాములు పట్టే వాళ్లకు సమాచారం ఇచ్చారు.
థాయ్ లాండ్ లోని క్రాబీ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ భారీ కింగ్ కోబ్రా బుసలు కొడుతోంది. అక్కడికి స్థానికుల సమాచారం అందుకున్న 40 ఏళ్ల సూ నౌహాడ్ అనే స్నేక్ క్యాచర్ వచ్చేశాడు.ఆయన ఎటువంటి హడావిడి చేయకుండా వట్టి చేతులతోనే పామును పట్టేశాడు. కర్ర సాయం కూడా తీసుకోకుండా పామును పట్టేశాడు. అది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కింగ్ కోబ్రా బుసలు కొట్టినప్పటికీ స్నేక్ క్యాచర్ భయపడలేదు. ఆ పాము ఏకంగా 4.5 మీటర్లు అనగా 14 ఫీట్ల పొడవు ఉంది. దాని బరువు 10 కిలోలు. కాగా, అంత పెద్ద పాముని 20 నిమిషాలలో పట్టేశాడు నౌహాడ్.

snake catcher catched 14 feet snake with bare hands video got viral
Viral Video : అంత పొడవున్నా కోబ్రాను.. ఈజీగా పట్టేశాడండోయ్..
ఆ తర్వాత ఆ పామును అడవిలోకి వదిలేశాడు. అయితే, తనలాగా ఎవరూ కర్ర సాయం లేకుండా పాములను పట్టేందుకుగాను ప్రయత్నం చేయొద్దని స్నేక్ క్యాచర్ కోరాడు. తాను పాములు పట్టుకోవడంలో ట్రైయినింగ్ తీసుకున్నానని, ఆ విధంగా నైపుణ్యం తీసుకున్న తర్వాతనే వట్టి చేతులతో పాములను పట్టుకోగలుగుతున్నానని స్నేక్ క్యాచర్ వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది.