Viral Video : పిల్లి వేషాలు మాములుగా లేవుగా.. ఏకంగా కుక్కనే మస్కా కొట్టించింది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పిల్లి వేషాలు మాములుగా లేవుగా.. ఏకంగా కుక్కనే మస్కా కొట్టించింది!

 Authored By mallesh | The Telugu News | Updated on :28 January 2022,9:00 pm

Viral Video : మనం ఇళ్లల్లో పెంచుకునే పెట్స్ అల్లరి చేయడం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి వీటి అల్లరి శృతి మించితే ఇంటి యాజమానులకు తడిసిపోతుంది. ఇళ్లంతా మళ్లీ సర్దుకోవాల్సి వస్తుంది. సాధారణంగా కొందరు తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. అందులోనూ మళ్లీ రెండు రకాలు. కొందరు క్యూట్ అండ్ షార్ట్ డాగ్స్‌ను పెంచుకుంటే మరికొందరు బిగ్ డాగ్స్‌ను పెంచుకుంటారు. ఇవి ట్రైయిన్ చేస్తే యాజమానులకు ఎంతో హెల్ప్ చేస్తుంటాయి. ఇంటికి కూడా రక్షణగా ఉంటాయి. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా శునకాల పేరు చెబుతుంటారు కొందరు. అయితే, కొందరు మాత్రం తమ ఇంట్లో కుక్కలతో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంటారు. ఇవి రెండు ఒకే చోట ఉంటే ఏమైనా ఉందా.? ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది.

కుక్కల కంటే పిల్లులు చాలా తెలివైనవి. శునకాలను దొరకకుండా ఎలా తప్పించుకోవాలో వాటికి బాగా తెలుసు. కుక్కలు ఉన్నాయంటే పిల్లులు సాధారణంగా ఆ వైపు వెళ్లవు. దూరం నుంచే వాటి రాకను గమనిస్తాయి. అంతేకాకుండా వెంటనే అక్కడి నుంచి జంప్ అవుతాయి. కుక్కలతో పోలిస్తే పిల్లులకు వినికిడి పవర్ ఎక్కువగా ఉంటుందట.. అందుకే చిన్న శబ్డం వినిపించినా అక్కడి నుంచి పరుగు లంకించుకుంటాయి. ఈ మధ్యకాలంలో కుక్కలు, పిల్లులు కలిసి ఆడుకునే వీడియాలు, అల్లరి చేస్తున్న దృశ్యాలను యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒకే దగ్గర ఉండి పిల్లులు కుక్కలు ఆడుకుంటుంటాయి. ఒకదానికొకటి సాయం చేసుకుంటుంటాయి.

the cats behavior was not normal

the cats behavior was not normal

Viral Video : కుక్కును ఏమార్చుతున్న పిల్లి

నిజానికి పిల్లిని చూస్తే చాలు శునకాలు పరిగెత్తిస్తుంటాయి. కానీ ఫన్నీ వీడియోల్లో మాత్రం అవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా లవ్ యానిమల్స్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫన్నీ వీడియా అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. పిల్లి, కుక్క ఒకే ఇంట్లో ఉంటాయి. డాగ్ మాత్రం బాల్‌తో ఆడుకుంటుండగా పిల్లి మధ్యలోకి వచ్చి ఆ బంతిని కుక్క దగ్గర నుంచి మెల్లిగా ఎత్తుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తుంది. అమాయకంగా ఫేస్ పెట్టి తన కళ్లతో కుక్క అటెక్షన్‌ను డైవర్ట్ చేస్తుంటుంది. తన కాళ్లతో మెల్లిగా బంతిని తన వైపుకు లాక్కుంటుంది. దీనికి చూసి కొందరు నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లి తెలివికి జోహార్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/Yoda4ever/status/1486005945607938048?s=20

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది