Viral Video : తాబేలు మంచి మనసు.. తాను నడవలేకపోయినా.. మరో జీవికి సాయం..
Viral Video : మనుషులకు, జంతువులకు చాలా తేడా కనిపిస్తోంది. మనుషులు ప్రతి విషయంలో స్వార్థంగా ఆలోచిస్తూ.. కేవలం తన పనికోసం ఇతరులను వాడుకుంటారు. కానీ జంతువులు మాత్రం ఎప్పటికప్పుడు తమ జాలి, కరుణను చాటుకుంటూనే ఉంటాయి. పందిపిల్లలకు కుక్క పాలు ఇవ్వడం, మేక పిల్లకి కుక్క పాలు తాగించడం వంటింటి మనం చూసే ఉంటాం. ఇలా సాటి జీవికి సహాయపడటంలో జంతువులు గొప్పవనే చెప్పాలి. వీటిని చూసి మానవులు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి.
ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను నడవలేని స్థితిలో ఉన్నా.. ఆ జీవి మరో జీవిని తనపై ఎక్కించుకుని ముందుకు సాగింది. తాబేలు తన జాలి హృదయంతో అందరి మనసును దోచుకుంది.అసలే అది తాబేలు.. చాలా నెమ్మదిగా నడుస్తుంది. అతి కష్టం మీద నడుస్తుంది. కానీ పక్కనే ఉన్న సీల్.. ఆ తాబేలుపైకి ఎక్కింది. మరి ఇంతకీ ఆ తాబేలు ఏమని అనుకుందో తెలియదు కానీ, దానిని నెమ్మదిగా మోసుకుంటూ ముందుకు సాగింది.

the turtle that helped the seal
Viral Video : సీల్‌కు సాయం చేస్తూ..
చివరకు నీటి వద్దకు చేరుకోగానే ఆ సీల్ జీవి.. తాబేలుపై నుంచి కిందికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ తాబేలు మనసును చూసి పొగడకుండా ఉండలేకపోతున్నారు. మరింకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కు వేయండి.
View this post on Instagram