Viral Video : పిల్లి పిల్లలను పొదిగిన కోడి.. వీడియో వైరల్..
Viral Video : జనరల్‌గా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇకపోతే ఏదేని యూనిక్ ఘటన జరిగినట్లయితే అందుకు సంబంధించిన వీడియోలు అయితే క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రజెంట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ సదరు వీడియోలో ఏం జరిగిందంటే..జనరల్‌గా కోడి పిల్లిని కాని పిల్లి పిల్లలను అస్సలు దగ్గరకు రానీయదు.
కానీ, సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియోలో ఓ కోడి పిల్లి పిల్లలను చక్కగా పొదుగుతోంది. దిస్ పిక్చర్ స్పీక్స్ అనే ట్విట్టర్ అకౌంట్ యూజర్ ‘కోడి పిల్లి పిల్లలను పొదిగింది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.సదరు వీడియోలో ఒక పెట్టేలా ఉన్న కోడి చక్కగా మూడు, నాలుగు పిల్లి పిల్లలను పొదుగుతోంది. వీడియోలో పిల్లలు కోడి కింద ఉండటాన్ని మనం గమనించొచ్చు కూడా.

this hen hatched kitten video got viral
Viral Video : అలా హాయిగా పిల్లి పిల్లలను దరి చేర్చుకున్న కోడి..
ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లి పిల్లలకూ వేడిగా ఉంది కావొచ్చు., ఎంత బాగుంది ఈ విషయం’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పిల్లి పిల్లలను కోడి పొదగడం కొంత విచిత్రమేనని మరి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ఇదో వింత విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/this_speaks/status/1485166436473774081?s=20