Viral Video : శభాష్ ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆయన ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ కొడతారు.. వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : శభాష్ ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆయన ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ కొడతారు.. వైరల్ వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :15 October 2023,2:00 pm

Viral Video : ఈరోజుల్లో ఎంతమందికి మానవత్వం ఉంటుంది చెప్పండి. ఈరోజుల్లో అందరూ బిజీ వ్యక్తులు. ఎవరి దగ్గర టైమ్ ఉండదు. ఎప్పటికప్పుడు బిజీబిజీగా ఉండటం వల్ల పక్కన వాళ్ల గురించి ఆలోచించే టైమ్ ఉండదు. అందుకే రోడ్డు మీద యాక్సిడెంట్ కూడా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోడ్డు మీద చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా కూడా పట్టించుకునే వాళ్లు లేరు ఈరోజుల్లో. అలాంటిది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన మానవత్వానికి శభాష్ అనాల్సిందే. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ కొడతారు. ఇప్పుడు ఎండలు ఎలా కొడుతున్నాయో చూస్తున్నాం కదా. ఎండలు మండిపోతున్నాయి. వేసవిలా ఎండలు మండిపోతున్నాయి. దీంతో బయటికి రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు.

తాజాగా ఓ ముసలావిడ 80 ఏళ్లకు పైనే వయసు ఉంటుంది. ఎలాంటి చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్తోంది. తను చెప్పులు లేకుండా వెళ్లడం చూసి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్ అవుతాడు. ఆమె చెప్పులు లేకుండా నడుస్తూ బాధపడటం చూసి ఆ కానిస్టేబుల్ తట్టుకోలేకపోతాడు. దీంతో వెంటనే తనకు కొత్త చెప్పులు కొని ఇస్తాడు. అలాగే ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

traffic constable bought old woman slippers video viral

#image_title

Viral Video : కానిస్టేబుల్ ను పొగుడుతున్న స్థానికులు

ఆ కానిస్టేబుల్ చేసిన పనికి స్థానికులు మెచ్చుకుంటున్నారు. కానిస్టేబుల్ చేసిన పనిని తెగ పొడిగేస్తున్నారు. ఆయనకు సెల్యూట్ కొడుతున్నారు. ఈరోజుల్లో ఇంకా మానవత్వం ఉందా అని షాక్ అవుతున్నారు. ఆ ముసలావిడ చెప్పులు వేసుకొని చిరునవ్వు చిందించడం చూసి జనాలు కూడా ఇది కదా మనం చేయాల్సింది. ఒకరిని సంతోష పెట్టడంలో ఉన్నంత ఆనందం మరొకటి ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది