Viral Video : దివ్యాంగుడిని చితకబాదిన పోలీసులు.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : దివ్యాంగుడిని చితకబాదిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :31 July 2023,8:00 pm

Viral Video : దివ్యాంగులు కనిపిస్తే ఎవ్వరైనా వాళ్లకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకు చేతనైన సాయం చేస్తాం. కనీసం వాళ్లకు మాట సాయం అయినా చేస్తాం. ఒకవేళ వాళ్లకు ఏదైనా ఫిజికల్ హెల్ప్ కావాలన్నా చేస్తాం. కానీ.. వాళ్లను బాధపెట్టం. వాళ్లను తిట్టం, కొట్టం. ఎందుకంటే.. వాళ్లు దివ్యాంగులు. వాళ్లకు కాళ్లు లేదా చేతులు పని చేయవు. వాళ్లకు ఏదో ఒక లోపం ఉంటుంది. అటువంటి వాళ్లను మనం బాధపెట్టడం కరెక్ట్ కాదు. కానీ.. ఈ పోలీసులు మాత్రం ఒక వికలాంగుడిని పట్టుకొని చితకబాదారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైసైకిల్ పై వెళ్తున్న దివ్యాంగుడిని డ్యూటీలో ఉన్న పీఆర్డీ జవాన్లు కొట్టారు. ఆయన్ను దుర్భాషలాడారు. ఇద్దరు పీఆర్డీ జవాన్లు ట్రైసైకిల్ పై వెళ్తున్న దివ్యాంగుడిని ఆపి మరీ కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. డియోరియా జిల్లా రుద్రపూర్ కొత్వాలిలోని ఖజువా చౌరాహాలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వికలాంగుడిపై దాడి చేసిన ఆ జవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు వాళ్లు ఎందుకు అతడిపై దాడి చే శారో మాత్రం తెలియలేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

up police beat disabled person video viral

up police beat disabled person video viral

Viral Video : భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

ప్రాంతీయ రక్షక్ దళ్ జవాన్లు అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ స్థానికులు కూడా మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఆ వీడియోను చూసి ఆ జవాన్లపై దర్యాప్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది