Viral Video : ఈ పిల్లుల బాక్సింగ్ మామూలుగా లేదు.. చూస్తే షాక్
Viral video : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా సరే ఈజీగానే వైరల్ అయిపోతోంది. సోషల్ మీడియా రాకముందు కూడా ఇలాంటి వీడియోలు అనేకం ఉండేవి. కానీ అవి అంతగా పాపులర్ అయ్యేవి కాదు. ఇప్పుడు మాత్రం ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. అయితే ఈ నడుమ ఎక్కువగా జంతువులకు సంబంధించిన క్యూట్ వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.
జంతువులు కూడా మనుషులను చాలా విషయాల్లో ఫాలో అవుతున్నాయి. ఇలాంటి వీడియో గురించే ఇప్పుడు చెప్పుకుందాం. పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కలు, పిల్లులు ఉంటాయి. ఇవి మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా విషయాల్లో మనుషులు చేసినట్టే చేస్తున్నాయి. కాగా బాక్సింగ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులు చేసే ఈ బాక్సింగ్‌ను ఇప్పుడు మూడు పిల్లులు చేస్తున్నాయి. ఈ వైరల్ వీడియోలో రెండు తెల్ల పిల్లులు ఓ రేంజ్‌లో బాక్సింగ్ చేస్తుండగా..
Viral video : అచ్చం మనుషులు చేసినట్టుగానే..
బ్రౌన్ కలర్ లో ఉన్న పిల్లి మాత్రం బయట ఉండి వాటితో పోరుకు సై అంటోంది. ఇక రింగ్ లోపల ఉన్న పిల్లులు మాత్రం చాలా సీరియస్ గా ఫైటింగ్ చేసుకుంటున్నాయి. అచ్చం మనుషులు చేసినట్టుగానే బాక్సింగ్ చేయడం ఇందులో మనం చూడొచ్చు. అయతే ఈ వీడియో మీద ఫన్నీ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పిల్లులు మామూలవి కావంటూ చెబుతున్నారు.
https://twitter.com/buitengebieden_/status/1484235338755325952