Viral Video : ఈ కుక్క డ్రైవింగ్ స్కిల్స్ చూస్తే షాకవకుండా ఉండలేరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఈ కుక్క డ్రైవింగ్ స్కిల్స్ చూస్తే షాకవకుండా ఉండలేరు…

 Authored By mallesh | The Telugu News | Updated on :14 May 2022,3:00 pm

నేటి రోజుల్లో పెంపుడు జంతువులు చాలా తెలివి మీరాయి. ఒకప్పుడు జంతువులు అంటే ఏదో అలా ఏ తెలివీ లేకుండా బతికేవి. కానీ ఇప్పుడు మాత్రం పెంపుడు జంతువులు చాలా తెలివితో వ్యవహరిస్తున్నాయి. వాటి యజమానులు వాటికి ఒక్కసారి చెబితే అంతే ఈజీగా నేర్చేసుకుంటున్నాయి. అంతే కాకుండా వాటి ప్రతిభను వాటి యజమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి చాలా వ్యూస్ మరియు లైక్స్ వస్తున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్క నెటిజన్ వావ్ అంటూ కుక్క తెలివికి మెచ్చుకుంటున్నారు.విక్టోరియాలోని హామిల్టన్ కు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాడు. ఆ కుక్క కూడా చాలా అద్భుతంగా డ్రైవింగ్ నేర్చుకుంది. అదేంటి కుక్క హైట్ కు డ్రైవింగ్ ఎలా సాధ్యపడుతుందా? అని చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది. కానీ ఆ కుక్కకు యాక్సిలరేటర్, ఇంకా బ్రేక్ అందకపోయినా కానీ స్టీరింగ్ ను మాత్రం చాలా బాగా కంట్రోల్ చేస్తుంది.

Viral Video Dog Driving Skills

Viral Video Dog Driving Skills

Viral Video : షాకయ్యేలా ఉన్న కుక్క డ్రైవింగ్ స్కిల్స్

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్రైవింగ్ మాత్రమే కాదండోయ్.. ఈ కుక్క గొర్రెల కాపరిగా కూడా ఇరగదీసిందట. ఇలా డ్రైవింగ్ నేర్చుకుని ట్రక్ నడిపే కంటే ముందు ఈ కుక్క గొర్రెల కాపరిగా పని చేసేదట. కుక్క గొర్రెల కాపరిగా పని చేసినపుడు ఒక్క గొర్రెను కూడా మంద నుంచి బయటకు పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించేదని ఆ యజమాని చెబుతున్నాడు. కుక్క తెలివితేటలతో తాను ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానని పేర్కొంటున్నాడు.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది