Viral Video : ఉడుము, కొండ చిలువు మధ్య భయంకరమైన ఫైటింగ్.. గెలిచింది ఎవరంటే..?
Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో అడవిలో నివసించే ప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోలు చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. వేరే వేరే జాతులకు చెందిన రెండు జీవులు ఫైటింగ్ చేసుకునే వీడియో కంటపడితే.. దానిని షేర్ చేసే వరకు వదిలిపెట్టరు చాలా మంది. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ కాస్త భయానికి సైతం లోనవుతున్నారు. కానీ ఆ రెండు ప్రాణులు తగ్గేదే లే అంటున్నట్టు యుద్ధం చేశాయి.
బలం మొత్తం క్షీణించినా ఓటమిని అంగీకరించుకుండా ప్రత్యర్థిని ఓడించేందుకు చివరి వరకు పోరాడాయి. మరి వీటిలో గెలిచింది ఎవరు?ఒక అడవిలో ఉడుము సంచరిస్తోంది. అది ఓ కొండచిలువ కంట పడింది. ఇక ఇంకేముంది.. అవి రెండు యుద్ధానికి దిగాయి. అసలు భయపడకుండా చివరి వరకు పోరాడుతూనే ఉన్నాయి. ఇక మరింత బలం తెచ్చుకున్న కొండ చిలువ.. ఉడుమును చుట్టేసింది. అయినా ఉడుము మాత్రం తగ్గలేదు. తన ఓటమిని ఒప్పుకోలేదు. కొండచిలువుతో పోరాడుతూనే ఉంది. చివరకు కొండచిలువు ఆ ఉడుమును గట్టిగా చుట్టేసి కదలకుండా చేసింది.
Viral Video in skunk the hill cross fighting between
Viral Video : మరి గెలుపు ఎవరిది?
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. అడవుల్లో ఎప్పుడు వేరే వేరు జాతి ప్రాణుల మధ్య ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అడవిలోనే కాదు మన చుట్టు పక్కల కూడా జంతువులు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాస్త భయానికి గురవుతున్నారనే చెప్పాలి. భిన్నమైన కామెంట్స్ సైతం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూసెయ్యండి.
