Viral Video : ఇదేమి విడ్డూరంరా పబ్లిక్లో ఇలాంటి పనులేంటి.. వీడియో?
ప్రధానాంశాలు:
Viral Video : ఇదేమి విడ్డూరంరా పబ్లిక్లో ఇలాంటి పనులేంటి ?
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం తీయటం, బంతులాట ఆడటం వంటి వినోదాత్మక ఆటలు , పాటలు ఉంటాయి. ఇవి వినోదంతో పాటు పెళ్లి సంబరానికి ప్రత్యేకతను కలిగించేవి. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల పేరుతో జరుగుతున్న మార్పులు చూసి చాలా మంది పెద్దలు, సభ్య సమాజం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video : ఇదేమి విడ్డూరంరా పబ్లిక్లో ఇలాంటి పనులేంటి.. వీడియో?
Viral Video : ట్రెండ్ పేరుతో వివాహ వేడుక అర్ధమే మారుస్తున్నారు కదరా..
ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో పబ్లిక్ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెరిగిపోతోంది. ఇది ప్రేమను వ్యక్తం చేయడం అని భావించినా, మర్యాదల్ని దాటి సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఏ వ్యక్తిగత జీవితం అయినా గౌరవంతో, మర్యాదతో ఉండాలి. సాంప్రదాయాలకూ, భావోద్వేగాలకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.
వివాహం అనేది ఓ గౌరవపూరిత బంధం. అది రెండు మనసుల మిళితమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య పటిష్టమైన సంబంధం. కొత్త తరానికి ట్రెండీగా ఉండాలన్న ఉద్దేశం మంచి సంగతి కానీ, అందులో సంస్కారాల్ని పక్కన పెట్టటం మాత్రం ఆలోచనీయమైన విషయం. ప్రేమను చూపించడంలో కూడా సంస్కారం, సిగ్గు ఉండాలి. వ్యక్తిగత హక్కుల్ని తక్కువ చేయకుండా, సమాజ భావాలను గౌరవించడం నిజమైన ఆధునికత అని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి దీనిని అర్ధం చేసుకుంటే బాగుంటుంది.
నాకు తెలిసి పెళ్లి లో కాలు తొక్కటం, ఉంగరం తీయటం తెలుసు, దానితో పాటు బంతులాట ఆడతారు
ఇదేమి విడ్డూరంరా పబ్లిక్ లో 🤣🤣🤣 pic.twitter.com/NGMbfF0yuI
— Ramesh- గ్యారీ గరికపాటి (@Garybabai) April 17, 2025