Viral Video : నువ్వు హీరోవి బాస్.. మంటల్లో చిక్కుకున్న కంగారూలను కాపాడిన సూపర్ మ్యాన్
Viral Video : ఉక్రెయిన్‌పై 33 రోజులుగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజలు తమ పిల్లలను, కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.పలు సిటీలను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను మాత్రం కైవసం చేసుకోలేకపోతోంది. రష్యన్ సేనల భీకర దాడులను ఉక్రెయిన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతూ.. రాజధానిని కాపాడుకుంటోంది. అయితే ఓ వైపు యుద్ధం సాగిస్తున్నా.. శాంతి ప్రయత్నాలను మాత్రం ఆపడంలేదు. యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు దేశాల ప్రతినిధులు మరో దఫా సంప్రదింపులకు సిద్ధమయ్యారు.
అయితే యుద్ధంకారణంగా మూగ జంతువులు సైతం చనిపోతున్నాయి. ప్రకృతి అందాలతో బ్యూటిఫుల్ గా కనిపించే ఉక్రెయిన్ ఇప్పుడు బాంబు దాడులతో ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తోంది. నిత్యం బాంబు మోతలతో ఉక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. కొంతమంది తమ ప్రాణాల కోసం పొరుగుదేశాలకు తరలిపోతుంటే.. మరికొందరు దిక్కుతోచని స్థితిలో ఉక్రెయిన్ లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధం ప్రారంభమైననాటినుంచి ఎక్కడో చోట కొందరు ఉక్రెయిన్ ప్రజలకు అండగా నిలుస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ ప్రశంసలు పొందుతున్నారు.
Viral Video : మూగ జీవుల కష్టాలు..
అయితే ఓ వ్యక్తి ఎనిమిది మూగ జీవాల ప్రాణాలు కాపాడి హీరో అనిపించుకుంటున్నాడు. బాంబు దాడుల వల్ల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలోగల ఫెల్డ్‌మాన్ ఎకోపార్క్‌లో మంటలు చెలరేగాయి. అందులోని కొన్ని మూగజీవాలు మంటల్లో చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి ఎనిమిది కంగారూలను కాపాడాడు. అనంతరం వాటిని వాహనంలో అక్కడినుంచి వేరేచోటుకు తరలించాడు. ప్రస్తుతం కంగారూలతో మెహికిల్ లో వెళ్తున్న ఆ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. మూగజీవాలను కాపాడిన ఆ వ్యక్తిపై అందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తో ఆ వ్యక్తి అందరి దృష్టిలో హీరో అయ్యాడు.
Are you expecting good news? We have them. Eight kangaroos were evacuated from the Feldman eco-park in Kharkiv region. #StandWithUkraine pic.twitter.com/mwErrzqglH
— Oleksandra Matviichuk (@avalaina) March 26, 2022