Vizag : మద్యపాన నిషేంధ… చెప్పేది ఒకటి చేసేది ఒకటి
Vizag విశాఖపట్నం : వైఎస్ఆర్‌సిపి 2019 ఎన్నికల మ్యానిఫేస్టోలో వైఎస్ఆర్‌సిపి అధికారం చేపట్టగానే రాష్ట్రంలో దశలవారీ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. సంవత్స రానికి 20 శాతం చొప్పున ఐదు సంవత్సరాలలో మద్యపాన రహిత రాష్ట్రంగా చేస్తామన్న వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం అందుకు విరుద్దంగా చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో విక్రయాలు బాగా తక్కువగా ఉన్న మద్యం దుకాణాలు గుర్తించి మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
గడిచిన రెండేళ్లలో 140 షాపులను మూసేశామని ప్రకటించింది. మూడో ఏడాదిలోకి అడుగు పెట్టాకి మరికొన్ని దుకాణాలను రద్దు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి సరికొత్త వ్యూహానికి తెరలేపింది. పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని అందించాలంటూ టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లలో కత్తగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తోంది. ఆ సెంటర్లకు ఆబార్కరి శాఖ మద్యం సరఫరా చేసినా బాధ్యతలు మాత్రం టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ఇప్పటికే అప్పుఘర్ లో ఒకటి ప్రారంభించగా సీతమ్మధారలో అవుట్ ప్రారంభానికి సిద్ధంచేశారు.
అరకులోయల్లోనూ ఈ సెంటర్లను దుకాణాలను ప్రారంభించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 20 పైగా మద్యం దుకాణాలను కొత్తగా ఏర్పాటుచేసే అవకాశం వున్నదని అధికారులు పేర్కొంటున్నారు. మేనిఫేస్టోలో మద్యం నిషేదం చేస్తామని ఇప్పుడు కొత్త షాపులకు అనుమతులు ఇవ్వడమేటిలని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 110 బార్లు , 266 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ నెలకు సగటున రూ.200 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.