Amaravati.. గురువే రూపశిల్పి.. ఉపాధ్యాయులకు సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Amaravati.. గురువే రూపశిల్పి.. ఉపాధ్యాయులకు సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరీకీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి సీఎం నివాళులర్పించారు. సీఎం రెసిడెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే […]

 Authored By praveen | The Telugu News | Updated on :5 September 2021,2:04 pm

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరీకీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి సీఎం నివాళులర్పించారు. సీఎం రెసిడెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. చదువే తరగని ఆస్తి అని, గురువే రూపశిల్పి అని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సర్వేపల్ల రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని తెలిపారు సీఎం జగన్.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది