Kodali Nani : ప్యాకేజీ అంటూ పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు వీడియో వైరల్..!!
Kodali Nani : వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రతిసారి నాకు భయం లేదు నాకు భయం లేదు అంటూ డైలాగులు చెబుతున్నావు. మరి నిన్ను చూసి వైసీపీలో ఎవరైనా భయపడుతున్నారా అంటూ పవన్ పై కొడాలి నాని సెటైర్లు […]
Kodali Nani : వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రతిసారి నాకు భయం లేదు నాకు భయం లేదు అంటూ డైలాగులు చెబుతున్నావు. మరి నిన్ను చూసి వైసీపీలో ఎవరైనా భయపడుతున్నారా అంటూ పవన్ పై కొడాలి నాని సెటైర్లు వేశారు.
ప్యాకేజీ ఎక్కడ నుంచో వచ్చి ఉండి ఉంటది.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జనసేన పార్టీ లాంటివి చాలా వచ్చాయి కాలగర్భంలో కలిసిపోయాయి. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈ రకంగా డబ్బులు సంపాదించవచ్చు అని.. రుజువు చేస్తున్నట్లు ఉంది అని పవన్ వైఖరి పై వ్యంగంగా విమర్శించారు. జగన్ బాగా పరిపాలిస్తే సినిమాలు చేస్తాను ప్రకటన చేశారు. అసల ఆయన సినిమాలు ఎవరు ఆపమన్నారు.
రాజకీయాల్లోకి వచ్చాను ఇంకా సినిమా రంగానికి వెళ్లే ప్రసక్తి లేదు అంటూ చెప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు యధావిధిగా సినిమాలు చేస్తున్నారు. ఇచ్చే ప్రకటనలలో ఆయనకే నిలకడ లేదు. నీలాంటి సినిమా నటులు రోడ్డు మీద చాలామంది తిరుగుతారు. నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదని కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు.