Y.S.Jaganmohan reddy : ఆ ప్రాంతం జగన్ కి సెంటిమెంట్… ఈసారి ఎన్నికల ప్రచారం కూడా అక్కడి నుంచే మొదలు ..
ప్రధానాంశాలు:
Y.S.Jaganmohan reddy : ఆ ప్రాంతం జగన్ కి సెంటిమెంట్... ఈసారి ఎన్నికల ప్రచారం కూడా అక్కడి నుంచే మొదలు ..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో వంద రోజుల్లో జరగనున్నాయి. శాసనసభ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైయస్సార్ సీపీ అధినేత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరు చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ హవా మరోసారి చాటి చెప్పడానికి వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించింది
Y.S.Jaganmohan reddy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో వంద రోజుల్లో జరగనున్నాయి. శాసనసభ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైయస్సార్ సీపీ అధినేత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తూ, ట్రాన్స్ఫర్ చేస్తూ కొత్త ఇన్చార్జిలను నియమించే పనిలో ఉన్నారు. ఇక జనసేన , టీడీపీ సీట్ల సర్దుబాటు విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి. అయితే ఈసారి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గా పెట్టుకున్నారు.
ఈనెల 25న విశాఖ జిల్లా భీమునిపట్నం వస్తున్నారు. ఐదు జిల్లాల రీజనల్ స్థాయి వైసీపీ మీటింగ్ ని అక్కడ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో చూసుకున్న ఈసారి ఉత్తరాంధ్ర అత్యంత కీలకంగా కానుంది. వైసీపీ రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో బలంగా ఉంది. గోదావరి జిల్లా రాజకీయంలో టీడీపీ, జనసేన కూటమి ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. కృష్ణా, గుంటూరు హోరాహోరి జరగనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఏపీలో అధికారానికి రాచబాట వేయనున్నాయని అంటున్నారు. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ ఇదే ముఖ్యమంత్రి సీటు అన్నది రాజకీయంగా ఉన్న విశ్లేషణ. ఈ నేపథ్యంగా చూసుకున్నప్పుడు జగన్ అందరికంటే ముందే అలర్ట్ అవుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ హవా మరోసారి చాటి చెప్పడానికి వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించింది. బీసీలు ఎక్కువగా ఉండడంతో పాటు వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ మరోసారి కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి వైసీపీ ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక శాతం సీట్లను బీసీలకు ఇస్తుంది. నాలుగు ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వడం ఒక రికార్డుగా చెప్పాల్సి ఉంటుంది. దాంతో మరోసారి వైసీపీ గెలిచేందుకు ఎంతో దోహదపడుతుందని ఆ పార్టీ అంచనా. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినా విపక్ష తెలుగుదేశం దానికి ఒప్పుకోకపోవడం మీద కూడా వైసీపీ ఉత్తరాంధ్రలోనే తెల్చుకోవాలని చూస్తుంది. టీడీపీ ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదని, లెక్కల సాక్షిగా కూడా రుజువు చేయబోతుంది. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ వ్యూహాలను పదును పెడుతుంది.