Ys Jagan : బాబు 11 నెలల్లో ఈ ఘోరాలా..? జగన్ సూటి ప్రశ్న..!
ప్రధానాంశాలు:
Ys Jagan : బాబు 11 నెలల్లో ఈ ఘోరాలా..? జగన్ సూటి ప్రశ్న..!
Ys Jagan : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూలిన ఘటన రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్‌లో ఆలయ గోడ కూలి ఏడుగురు మృతిచెందడం అందరినీ విషాదంలో ముంచింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో ఈ ఘటన మరింత దురదృష్టకరంగా మారింది. సంఘటన అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విశాఖ చేరుకుని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

#image_title
Ys Jagan నాసిరకం తో నిర్మించి ప్రజల ప్రాణాలు తీస్తారా..? బాబు కు జగన్ ప్రశ్న
ఈ ఘటనపై స్పందించిన జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. “పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించారు?” అని ప్రశ్నించారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను గుర్తు చేస్తూ, అదే తరహాలో సింహాచలంలో కూడా అధికారుల ఘోర తప్పిదం కారణంగానే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు.
గోడ నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేసిన జగన్ ఇటీవలే ప్రారంభించిన నిర్మాణాన్ని నాసిరకంతో పూర్తి చేయడం ఏంటి ? అని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా పనులు అప్పగించడం, కాలమ్స్ లేకుండా గోడ నిర్మించడం అవినీతి పరంపరకి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత 11 నెలల చంద్రబాబు పాలనలో వరుసగా జరుగుతున్న సంఘటనలు .. తిరుపతిలో తొక్కిసలాట, శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్ల మృతి, గోశాలలో గోవుల మృతి వంటి ఘటనలన్నీ ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా విఫలమైందో చాటుతున్నాయని జగన్ మండిపడ్డారు.