Ys sharmila : చంద్రబాబును పర్సనల్ గా కలిసిన వైఎస్ షర్మిల…!
ప్రధానాంశాలు:
Ys sharmila : చంద్రబాబును పర్సనల్ గా కలిసిన వైఎస్ షర్మిల...!
Ys sharmila : త్వరలోనే వైయస్ షర్మిల కొడుకు పెళ్లి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని వైయస్ షర్మిల రాజకీయ ప్రముఖులను కలిసి తన కొడుకు పెళ్లికి ఆహ్వానాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ షర్మిల చంద్రబాబు ను కలిసి తన కుమారుడి పెళ్లికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందించింది. ఇక చంద్రబాబును కలిసి బయటకు వచ్చినా అనంతరం మీడియాతో ముచ్చటించిన షర్మిల మాట్లాడుతూ…వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మనవడు నా కొడుకు పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలామంది రాజకీయ నాయకులను, ప్రముఖులను ఆహ్వానించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగిందని తెలియజేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్నేహం గురించి , వారి రాజకీయ ప్రస్తావని గురించి ,గుర్తు చేసుకున్నారని తెలియజేశారు.చంద్రబాబు గారితో చాలాసేపు మాట్లాడాలని ఆయనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించిందని షర్మిల చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే యాంకర్లు రాజకీయ విషయాలు ఏమైనా మాట్లాడుకున్నారని షర్మిల అని అడగగా…షర్మిల సమాధానం ఇస్తూ అలాంటివి మాట్లాడుకోలేదని కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి చంద్రబాబు గారు గుర్తు చేసుకున్నారని , వారిద్దరూ కలిసి రాజకీయాలు మొదలుపెట్టినప్పటినుండి జరిగిన విషయాలను తలచుకున్నారని , వారిద్దరూ కలిసి ప్రయాణం చేసిన తీరును వెల్లడించారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మీ పదవి ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలకు కూడా షర్మిల సమాధానం ఇచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని అనుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఎంతో ముఖ్యమని అనిపించడంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా షర్మిల తెలియజేశారు. ఇక పార్టీలో చేరిన తర్వాత వారు ఎలా ఆదేశిస్తే అలా నమ్మకంగా చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ రాజకీయమంతా తనకు ఏ పదవి ఇస్తారని దానిపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు గారిని కలవడం మామూలుగానే ఫ్రెండ్లీ ఎన్వైర్మెంట్లో అందరూ చూస్తే బాగుంటుంది. అలాగే లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేకు మాత్రమే పంపడం జరిగింది.
ఒక కేకే కదండీ పంపించింది. ఇక ఆ కేకు అనేది మేము ఒక చంద్రబాబు నాయుడు గారికి పంపలేదు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి కూడా పంపడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే రాజకీయం అనేది జీవితం కాదు. అది మా ప్రొఫెషన్ మాత్రమే. ప్రజల కోసం మేము చేస్తున్న సర్వీస్ మాత్రమే . ఆ క్రమంలో మేము ఒకరిని ఒకరు మాటలనుకుంటాం . అంతేకాక మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి మాటలు అనుకోవాల్సి వస్తుంది. కానీ పండుగలలో పెళ్లి సందర్భాలలో వారికి ఏవైనా కానుకలు పంపిస్తే దానిని వేరే విధంగా చూడకూడదు అందరం ఫ్రెండ్లీగా ఉండాలని ఆమె చెప్పుకోచ్చారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాను. ఇది ఏమాత్రం పొలిటికల్ కానే కాదని షర్మిల చెప్పుకొచ్చారు.