Business : చదువు మానేసి.. నెలకి రూ. 50 వేల ఆదాయం.. వ్యవసాయానికి అనుగుణంగా వ్యాపారం..!
ప్రధానాంశాలు:
Business : చదువు మానేసి.. నెలకి రూ. 50 వేల ఆదాయం.. వ్యవసాయానికి అనుగుణంగా వ్యాపారం..!
Business : సహజంగానే చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యవసాయంలో Agriculture కొంతమంది మాత్రమే లాభాలను పొందుతారు.. చాలామంది వ్యవసాయం చేస్తూ సరియైన మీరు పోషణ లేక నష్టపోతూ ఉంటారు.. ఈ విధంగా నష్టపోయిన వారు ఎలాంటి వ్యాపారాలు Agri Allied Business చేస్తే మనం లాభం పొందుతాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొందరు రైతులు వ్యవసాయంతో పాటు కొన్ని రకాల బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే వ్యవసాయానికి అనుగుణంగా పశుపోషణ, కోళ్ల పెంపకం లాంటి వ్యాపారాలను చేస్తూ అభివృద్ధిని పొందుతున్నారు..
ఈ విధంగానే ఓ గ్రామంలో ప్రవీణ్ మాన్ కార్ అనే ఓ యువకుడు తన సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ప్రవీణ్ అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ప్రవీణ్ మాత్రం ఇంటర్మీడియట్ చదువుకున్నాడు.. ప్రవీణ్ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే ఎప్పుడు చేసే వ్యవసాయపు పంటలైన కంది, సోయా, పత్తి పంటలతో ఎక్కువగా నష్టాలు వచ్చేవి. దీంతో వాణిజ్య పంటలతో పాటు పాడి పరిశ్రమ మీద కూడా తను దృష్టి పెట్టారు. అంతే ఇక అతను పరిశ్రమలు మొదలుపెట్టి ముందుగా వచ్చిన గేదె పాలను తన ఊరిలో అమ్మడం మొదలుపెట్టారు.అలాగే మిగిలిన పాలను సిటీకి తీసుకెళ్లి అమ్మడం కొనసాగించాడు. ఈ విధంగా చేయడం వలన పాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఈ వ్యాపారంలో మంచి లాభాలను చూశాడు.
ఐదేళ్లకు మునుపు మొదలైన పాల వ్యాపారం 7 గేదెలతో ప్రారంభించాడు. ప్రతిరోజు 30 లీటర్ల పాలను సేకరించి అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో నెలకి 50 వేల రూపాయల వరకు పొందుతున్నాడు. దీంతో పాటు కోళ్లను కూడా పెంచడం మొదలుపెట్టారు. రైతులకు ఒక వ్యవసాయంపైనే ఆధారపడకుండా దానికి అనుబంధంగా కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమ కూడా పై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. రైతులు కష్ట కాలంలో ఇవి ఖచ్చితంగా ఆదుకుంటాయని ప్రవీణ్ చెప్తున్నాడు. రైతులకు ప్రభుత్వాలు కూడా వీటి పైన సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని ప్రవీణ్ తెలిపాడు. ఈ విధంగా ప్రవీణ్ మాన్ వ్యవసాయానికి అనుగుణంగా పాడి, కోళ్ల పెంపకం చేస్తూ నెలకి 50 వేల రూపాయలను సంపాదిస్తున్నాడు..