‘అమరరాజా’ పై ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్
chittoor : చిత్తూరు: బ్యాటరీ అమ్మకాల్లో దిగ్గజమైన ప్రముఖ అమరరాజా కంపెని వ్యవహారం గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అమరరాజా, టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాలుష్య ఎక్కువ అవుతున్న తరుణంలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించని 54 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారు. దీని చంద్రబాబు 54 నాలుగు కంపెనీలకు నోటీసుల ఇస్తే అమరరాజా గురించి పాజిటివ్ గా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఈ విషయాన్ని కేవలం కాలుష్య సమస్యగానే చూడాలని… రాజకీయం చేయెద్దని హితవు పలికారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించక పోవడం వళ్లే పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చారు. అంతే కానీ ఆ పరిశ్రమలపై ఎలాంటి రాజకీయ ప్రలోబాలు లేవని కేవలం నిబంధనలు పాటించక పోవడం వళ్లే నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు.
chittoor : ఇది పద్దతి కాదు: ఎమ్మెల్యే రోజా
చంద్రబాబు నాయుడు ప్రతి విషయాన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో అమరరాజా ఒక్కటే కాదు… 54 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని, దీని ద్వారా గాలి, నీరు, భూమి, పూర్తిగా కలుషితమవుతుంది. అమర రాజా పరిశ్రమ కాలుష్య నిబంధనలు పాటించకుండా వేల మంది ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. 54 పరిశ్రమలపైగానీ అమరరాజా కంపెనీలను మూసివేయాలనే ఉద్దేశం జగన్ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ప్రరిశ్రమలు చేస్తున్న తప్పులను సరిదిద్దుకుని కాలుష్య నియంత్రన మండలి నిబంధనల ప్రకారం పరిశ్రమలు నడుపుకోవచ్చని రోజా చెప్పుకొచ్చారు.