Akshaya Tritiya : అక్షయ తృతీయ కు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు… దాని విశిష్టత ?
Akshaya tritiya : అక్షయ తృతీయకు హిందువులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అయితే దీనివెనుకు పురాణ విశేషాలు ఏమున్నాయి అనేది తెలుసుకుందాం… హిందూ పురాణాల ప్రకారం త్రేతా యుగం అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. అక్షయ తృతీయ, పరశురామ జయంతి పుట్టినరోజు (విష్ణువు 6 వ అవతారం) ఒకే విధంగా వస్తుంది. అయితే, కొన్నిసార్లు తిథిని బట్టి పరశురామ జయంతి అక్షయ తృతీయ రోజుకు ఒక రోజు ముందు పడవచ్చు. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు. వైశాఖ శుద్ధ తదియ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఎంతో విశిష్టమైంది.
ఏం చేయాలి ?
ఈ రోజు దానం చేస్తే గ్రహ దోషాలు, పూర్వకర్మ ఫలితాల తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ రోజున జపం,హోమం, పితృ తర్పణం, దానం అక్షయ ఫలితం లభిస్తుంది.
ఏం దానం చేయాలి ?
వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు దశ దానాలు కూడాశక్తి కొలది చేయవచ్చు. అలాగే ఈ రోజు ఏ పూజ చేసినా అధిక ఫలాన్ని ఇస్తుంది. పితృ తర్పణం చేస్తే పితృలకు అక్షయ పుణ్య ఫలాలు లభిస్తాయి.
ఎవరి శక్తిని అనుసరించి వారు దానం చేస్తే వారికి మంచి ఫలితాలు వస్తాయి. శుభం జరుగుతుంది.
అక్షయ తృతీయ నాడు శుభ సమయం ఇదే !
అక్షయ తృతీయ అంటే పవిత్రమైన దినంగా హిందువులు, జైనులు భావిస్తారు. ఈ రోజును అత్యంత పవిత్రంగా భావించి దానధర్మాదులు, యజ్ఞయాగాదులు, బంగారం వంటి విశేషమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున ఏ సమయం మంచిది తదియ తిథి విశేషాలు తెలుసుకుందాం…
సాధారణ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. ఈసారి అక్షయ తృతీయ 2021 మే 14 న వచ్చింది. తృతీయ తిథి 2021 మే 14 న 05:38 గంటలకు ప్రారంభమై 2021 మే 15 న 07:59 గంటలకు ముగుస్తుంది.
అక్షయ తృతీయ పూజ ముహూర్తం- ఉదయం 05:38 నుండి 12:18 వరకు (వ్యవధి: 06 గంటలు 40 నిమిషాలు) ఉంది.
బంగారం కొనుగోలు చేయాల్సిన సమయం
అక్షయ తృతీయ బంగారు కొనుగోలు చేయడానికి శుభసమయం 05:38 మే 14, 2021 నుండి మే 15, 05:30 వరకు. (వ్యవధి: 23 గంటలు 52 నిమిషాలు)
చోఘడియా సమయం: ఉదయం ముహూర్తం (చారా, లాభా, అమృత): 05:38 నుండి 10:36 వరకు
మధ్యాహ్నం ముహూర్తం (చారా): 17:23 నుండి 19:04 వరకు
మధ్యాహ్నం ముహూర్తం (శుభ): 12:18 నుండి 13:59 వరకు
రాత్రి ముహూర్తం (లాభా): 21:41 నుండి 22:59 వరకు
రాత్రి ముహూర్తం (శుభ, అమృత, చరా): 00:17 నుండి 04:12, మే 15