Raksha Bandhan : 300 సంవత్సరాలుగా ఈ గ్రామాలు రాఖీ పండుగకు దూరంగా ఉండడానికి కారణం ఇదేనట.!!
Raksha Bandhan : రాఖి పండుగ అంటే అన్న, చెల్లెలు అక్క, తమ్ముడు ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అంటారు. ఈ రాఖీ పండుగ రోజున ఆడపిల్లలు అందరూ రాఖి కట్టి, వారి నుదుటిన కుంకుమ నుదిటిన పెట్టి హారతి ఇస్తారు. ఇలా రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు ఆయుషు, ఆరోగ్యం, సంతోషమైన జీవితం, సంపద, వైభవం ఆనందం, శ్రేయస్సు సోదరుల ఐశ్వర్యం కోసం దేవుడిని ఆరాధిస్తారు. రాఖి కట్టినందుకు వారు తన సోదరీమణులకు కొన్ని బహుమతులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా సోదరీమణులకి ఎప్పుడు రక్షణగా ఉంటాను అని మాట ఇస్తారు. అయితే ఈ నెలలో ఈ రాఖీ పండుగ ఆగస్టు 11న జరుపుకోబోతున్నారు.
అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ రాఖి పండుగ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామంలో మాత్రం అస్సలు ఈ పండుగను చేసుకోరట. మనకి వినడానికి వింతగా అనిపించిన ఇదే వాస్తవం.. దానికి గట్టి కారణమే ఉన్నది అని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని హర్పూర్ జిల్లా పర్యవేక్షణలో 60 గ్రామాలు వారు ఈ రాఖీ పండుగను చేసుకోరట. అంటే అందరు లాగా చేసుకోరట వారు చేసుకునే తీరు పూర్తిగా వెరైటీగా ఉంటుందట. సుమారు నాలుగు, ఐదు శతాబ్దాల ప్రజలు ఈ రాఖీ పండుగను పూర్తి వ్యతిరేకంగా జరుపుకుంటున్నారు. రాఖీ పండుగ రోజున ఇక్కడ సోదరీమణులు తమ సోదరులకు చేతులకి రాఖీలు కట్టరట దానికి బదులుగా వారి కలప కర్రలకు రాఖీలు కడతారుట. ఈ రాఖీ పండుగ రోజు ఎటువైపు చూసిన కలప కర్రలకు రాఖీలు కట్టి కనిపిస్తూ ఉంటాయట.
అదేవిధంగా మీరట్ లోని మరొక గ్రామం వారు కూడా మరొక విధంగా జరుపుకుంటారట. మీరట్ లోని పురాణ అనే ఒక గ్రామం ప్రాచీన కాలంలోని శాపం కారణంగా అక్కడ వారు రాఖీ పండుగలను చేసుకోరట. 12వ శతాబ్దంలో ఈ రక్షాబంధన్ రోజున మహమ్మద్ ఘోరీ ఈ గ్రామం పై దండెత్తుతాడు ఈ గ్రామంలో వారందరినీ చంపేస్తాడట. ఒక సోదరీమణి ఆమె ఇద్దరు కొడుకులు మాత్రమే బ్రతికారు. ఎందుకనగా వాళ్లు ఆ పండుగ రోజున గ్రామంలో లేరట. ఆతర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్లు అక్కడ నివసించారు. ఒక సంవత్సరం తర్వాత వారు రాఖీ పండుగను చేసుకుందామని అనుకున్నారట. అయితే ఆ రోజున ఓ పిల్లవాడుకి ఒక ప్రమాదం జరిగి కంటి చూపు పోయిందట. దానివలన ఆ ఊర్లో ఈ రాఖీ పౌర్ణమి పూర్తిగా మర్చిపోయారట. ఇలా 300 సంవత్సరాలుగా ఈ రాఖీ పౌర్ణమి నిషేధించారట. ఇక అక్కడ అప్పుడు నుంచి ఈ పండుగను జరుపుకోరట.