Rasi Phalalu : గురు,కుజుల సంచారం ఫిబ్రవరి నెల‌లో..ఈ రాశుల వారికి సిరుల‌ వర్షం కురిపిస్తుంది….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rasi Phalalu :  గురు,కుజుల సంచారం ఫిబ్రవరి నెల‌లో..ఈ రాశుల వారికి సిరుల‌ వర్షం కురిపిస్తుంది….?

 Authored By aruna | The Telugu News | Updated on :27 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Rasi Phalalu :  గురు,కుజుల సంచారం ఫిబ్రవరి నెల‌లో..ఈ రాశుల వారికి సిరుల‌ వర్షం కురిపిస్తుంది....?

Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారంకు ప్రాముఖ్యత అయితే ఉందో, గ్రహాల యొక్క వక్రగతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వచ్చే ఫిబ్రవరి మాసమున 26వ తేదీన కుజుడు వక్రంగా మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఇలా ఒక్క తరగతిలో కుజుడు సంచారం చాలా అరుదుగా జరుగుతుంది. అంతేకాదు ఫిబ్రవరి 5వ తేదీన గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక ఈ రెండు ముఖ్య గ్రహాలు కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు.

Rasi Phalalu గురుకుజుల సంచారం ఫిబ్రవరి నెల‌లోఈ రాశుల వారికి సిరుల‌ వర్షం కురిపిస్తుంది

Rasi Phalalu :  గురు,కుజుల సంచారం ఫిబ్రవరి నెల‌లో..ఈ రాశుల వారికి సిరుల‌ వర్షం కురిపిస్తుంది….?

Rasi Phalalu మేష రాశి :

మేష రాశి వారికి కుజుడు యొక్క ఉగ్రగతి కారణంగా ఆకస్మికంగా ధన లాభాలు కలుగుతాయి. అయితే ఉద్యోగాలు చేసే వారికి పదవుల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పటిదాకా మేష రాశి వారికి ఉన్న ఆస్తి వివాదాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఒక వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ మాసంలో మేష రాశి వారు చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతారు.

Rasi Phalalu వృషభ రాశి :

వృషభ రాశిలో రెండు గ్రహాలు ప్రత్యేకమైన ప్రభావం కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ధనయోగం ఏర్పడుతుంది. కాశి వారు ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ ని సాధిస్తారు. ఈ రాశి వారికి ఏ గతం కంటే కూడా ఆదాయం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. వివాహిక జీవితంలో కూడా చాలా ఆనందంగా సుఖదాయకంగా ఉంటారు. వీరి పని చేసే వృత్తి వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు.

Rasi Phalalu సింహరాశి:

ఈ సింహ రాశి వారికి కుజుడు వక్రగతి తో పాటు గురువు సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. సింహ రాశి వారికి ఎప్పుడూ కూడా ఊహించనంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగ వృత్తిలో పదోన్నతులు పొందుతారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వ్యాపారాలు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం.

మకర రాశి :

ఈ రాశి వారు రెండో గ్రహాలు ప్రత్యేకమైన ప్రభావం చేత శుభవార్తల్ని వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారానికి పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైన సమయం. దాకా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చెప్పాలంటే ఈ రాశి వారికి అంతా శుభసమయమే.

కన్యా రాశి :

కుజుడు వక్రగతి తో పాటు, గురువు సంచారం కారణంగా కన్య రాశి వారికి సమయం చాలా బాగుంటుంది. కన్యా రాశి జాతకులు సంపన్నులవుతారు . ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లతో పాటు ప్రమోషన్లు కూడా వస్తాయి. నూతన వ్యాపారాలకు ఆదాయం ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది