Akira Nandan : పవన్ తనయుడితో పాటు మాజీ భార్యకు కరోనా.. ఇంట్లో ఉన్నా వచ్చింది..!
Akira:కరోనా మహమ్మారి గుబులు రేపుతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి విజృంభిస్తుంది. లక్షకు పైగా కేసులు దేశంలో నమోదు అవుతున్నాయంటే ఈ వైరస్ విజృంభణ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనాకి ఒమిక్రాన్ తోడు కావడంతో కేసుల సంఖ్య క్రమక్రమేపి పెరుగుతుంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు.బాలీవుడ్ లో అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్..
మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, అలయ ఎఫ్, అర్జున్ బిజ్లానీ, డెల్నాజ్ ఇరానీ, ప్రేమ్ చోప్రా వంటి పలువురు బీటౌన్, టీవీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సౌత్‌లో మహేష్ బాబు,తమన్, మంచు లక్ష్మీ, కుష్బూ, శోభన, త్రిష, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్ అనేక మంది పీఆర్వోలు కూడా కరోనా బారిన పడ్డారు.తాజాగా రేణూ దేశాయ్, అకీరా నందన్‌లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తాజాగా రేణూ దేశాయ్ ప్రకటించింది. మేం అంతా కూడా ఇంట్లోనే ఉన్నాం. న్యూ ఇయర్‌కి కూడా ఇంట్లోనే ఉన్నాం.
Akira Nandan : గుబులు పుట్టిస్తున్న కరోనా
కానీ మేం గత కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడ్డాం. పాజిటివ్ అని మాకు ఫలితం వచ్చింది. మేం ప్రస్తుతం ఇద్దరం కూడా రికవరీ అవుతున్నాం. ఈ థర్డ్ వేవ్‌ని అందరూ సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి.. వీలైనంత వరకు జాగ్రత్తగానే ఉండండి అని రేణూ దేశాయ్ స్పష్టం చేసింది. నేను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. అకీరాకి ఇప్పించాలని అనుకున్న సమయంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొంది రేణూ.