Vishnu Priya : విష్ణు ప్రియకి దక్కిన అవకాశం.. ఈ సారి విన్నర్ అతనేనా?
ప్రధానాంశాలు:
Vishnu Priya : విష్ణు ప్రియకి దక్కిన అవకాశం.. ఈ సారి విన్నర్ అతనేనా?
Vishnu Priya : బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ టైటిల్ కోసం తెగ పోరాడుతున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ వారంలోపు టాప్ 5 ఎవరు.. ఫినాలే కోసం పోటీపడే కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇప్పటికే ఫినాలే రేసుకు అవినాశ్ వెళ్ళిపోయాడు. ఈ వారం అంతా ఓట్ ఆఫ్ అపీల్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా..రోజుకోరకంగా టాస్క్ లు పెడుతూ…ఆడియన్స్ ను ఓటు అడిగే అవకాశం ప్రత్యేకంగా కల్పిస్తున్నాడు బిగ్ బాస్. ఓటు ఆఫ్ అపీల్ టాస్క్ లో రూల్స్ పాటిస్తూ.. ఆడినటువంటి విష్ణు ప్రియను విన్నర్ గా ప్రకటించారు.
Vishnu Priya ఎవరు విన్నర్..
ఇక మొదటి రౌండ్ లో రోహిణి, రెండో రౌండ్ లో విష్ణు ప్రియ గెలవడంతో.. ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే ఆప్షన్ ను హౌస్ లో ఉన్నవారందిరకి ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ సారి మాత్రం అందరిఓట్లు విష్ణు ప్రియకే పడ్డాయి. ఆమెకే అంతా సపోర్ట్ చేశారు. ఒక్క అవినాశ్ మాత్రం రోహిణికి సపోర్ట్ చేశాడు. ఇక విష్ణు ప్రియ ఆడియన్స్ ను తనకు ఓటు వేయాల్సిందిగా వేడుకుంది.తన పర్సనల్స్ కొంత మందికి నచ్చలేదు. కాని నేను ఆడిన గేమ్ ను దృష్టిలో పెట్టుకుని నాకు ఓట్ చేయండి అంటూ వేడుకుంది. అంతే కాదు ఇప్పటి వరకూ బిగ్ బాస్ తెలుగు లో మహిళా విజేత లేరు. నన్ను ఈసీజన్ విన్నర్ ను చేయడానికి ఓట్ చేయండి అంటూ వేడుకుంది విష్ణు ప్రియ.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి రెండో వారమే ఎలిమినేట్ కావాల్సిన గౌతమ్ కృష్ణ కన్నడ కంటెస్టెంట్స్ తో పాటు బీబీ టీమ్‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ సంపాదించుకుని టైటిల్ విన్నర్ రేస్‌లో నిలిచాడు. బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ట్రోఫీని ఎత్తే క్వాలిటీస్ గౌతమ్ లేదా నిఖిల్‌లో మాత్రమే ఉన్నాయంతగా పేరు తెచ్చుకున్నాడు. ఏది ఏమైన ఈ సారి బిగ్ బాస్ చివరి పోరు ఆసక్తికరంగానే ఉండబోతుంది. మరోవైపు హౌజ్‌లో పలువురు సెలబ్రిటీలని కూడా పంపిస్తూ తెగ సందడి చేయబోతున్నారట.