Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో మొదలైన నామినేషన్స్ రచ్చ..!
Bigg Boss 8 Telugu : 7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం నుంచి కొత్త సీజన్ ను మొదలు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 కొత్త టాస్కులతో ఆడియన్స్ ని అలరించనుంది. ఈసారి లిమిట్ లెస్ అంటూ హోస్ట్ నాగార్జున చెబుతుండగా షోని రక్తికట్టించేందుకు హౌస్ మెట్స్ కూడా అదరగొడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి […]
Bigg Boss 8 Telugu : 7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం నుంచి కొత్త సీజన్ ను మొదలు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 కొత్త టాస్కులతో ఆడియన్స్ ని అలరించనుంది. ఈసారి లిమిట్ లెస్ అంటూ హోస్ట్ నాగార్జున చెబుతుండగా షోని రక్తికట్టించేందుకు హౌస్ మెట్స్ కూడా అదరగొడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. హౌస్ లోకి ఇలా వచ్చారో లేదో అలా గొడవలు కూడా మొదలు పెట్టారు.
మేక్ కంటెస్టెంట్స్ లో నాగ మణికంఠ ఎవరితో పెద్దగా కలవకుండా తనేదో తన లోకం అన్నట్టుగా ఉన్నాడు. ఇక బెజవాడ బేబక్క కుక్కర్ విషయంలో చేసిన అశ్రద్ధ వల్ల సోనియా ఆమెను ఎటాక్ చేసింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలవడం వల్ల హౌస్ లో కొత్తగా ఈ వారం ముగ్గురు చీఫ్ లు ఎంపికయ్యారు. నిఖిల్, యష్మి, నైనికలు చీఫ్ గా ఉన్నారు.
Bigg Boss 8 Telugu మొదటి నామినేషన్ లోనే రచ్చ షురూ..
ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ గురించి తెలిసిందే. ఆదివారం ముగిసింది సోమవారం వచ్చింది అంటే నామినేషన్స్ లో ఎవరి ఎవరిని ఎటాక్ చేస్తారా అని ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 లో మొదటి నామినేషన్స్ లో కూడా హౌస్ మెట్స్ పోట్లాడుకున్నారు. మంగళవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో మణికంఠ, నబీల్, బేబక్క, శేఖర్ బాషా నామినేట్ అయ్యారు.
ఇక ఈ నామినేషన్ ప్రక్రియ టైం లో నిఖిల్ వర్సెస్ కిరాక్ సీత మధ్య మాటా మాటా పెరిగింది. చీఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని నిఖిల్ మధ్యలో మాట్లాడొద్దని కిరాక్ సీతకి చెబితే నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి నీకు ఆ రైట్స్ లేవని అన్నది సీత. అలా నామినేషన్స్ మొదటి భాగం రచ్చ మొదలైంది. ఐతే మంగళవారం పూర్తి నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈరోజు ఎపిసోడ్ లో మిగతా నామినేషన్స్ జరుగుతాయి.