D show Chaitanya : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య.. మాట్లాడిన లాస్ట్ కాల్.. ఆడియో మరియు వ్యక్తి వీడియో వైరల్..!!
D show Chaitanya : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన చైతన్య… మరణ వార్త చాలామందికి దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే చనిపోవడానికి అరగంట ముందు ఓ వ్యక్తితో మాట్లాడిన మాటలు వీడియో మరియు చాటింగ్ మొత్తం బయటపడింది. ఆ వ్యక్తి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన పవన్ అనే వ్యక్తితో ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాట్లాడటం జరిగిందంట. శ్రీకాకుళంలో డాన్స్ ఈవెంట్ కండక్ట్ చేయాలని తనతో చైతన్య సంప్రదింపులు చేసినట్లు తెలియజేశారు. 2017 నుండి చైతన్యతో తనకి పరిచయం ఉందని పవన్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
తనకి డాన్సర్లు అంటే ఇష్టంతో పాటు చాలామందికి స్పాన్సర్ చేయడంతో.. నా ఇష్టాన్ని చూసి చైతన్య అభిమానించి… పలు ఈవెంట్లకు తనని పంపించినట్లు పవన్ చెప్పుకొచ్చాడు. అయితే లాక్డౌన్ సమయంలో… కొద్దిగా ర్యాపో తగ్గింది. ఈ క్రమంలో చైతన్య కరోనా బారిన పడిన సమయంలో స్వయంగా చైన్ తాకట్టు పెట్టి ఆయన ట్రీట్మెంట్ కోసం డబ్బులు సాయం చేసినట్లు పవన్ స్పష్టం చేశారు. అయితే తనకి కూడా డబ్బులు ఇవ్వాలని చనిపోవటానికి అరగంట ముందు తనకి షూటింగ్ నుండి ఇంక మల్లెమాల మీడియా నుండి డబ్బులు వస్తాయని అవి వచ్చినట్టే ఇస్తానని మాట ఇచ్చారు.
అంతేకాదు తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చైతన్య తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నాతో ఫోన్లో మాట్లాడటం తర్వాత చాటింగ్ చేయగా మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించినట్లు వార్త రావటంతో నేను షాక్ అయిపోయాను అని పవన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.