Deepthi Sunaina : బంగార్రాజు పాటకి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అలరించిన దీప్తి సునయన..!
Deepthi sunaina : దీప్తి సునయన.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడచక్కని అందంతో అందరి మనసులు కొల్లగొడుతుంది దీప్తి. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.షణ్ముఖ్ తో ప్రేమాయణంతో హాట్ టాపిక్ గా మారిన దీప్తి సునయన ఇటీవల ఆయనకు బ్రేకప్ చెప్పి తెగ వార్తలలో నిలిచింది.
సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా టాప్ యూట్యూబర్‌గా పేరొందాడు. ఈ క్రేజ్ కారణంగానే అతడు బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులోకి టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా మంచి గేమ్‌తో సత్తా చాటుకున్నాడు. అయితే సిరితో క్లోజ్‌గా ఉన్న షణ్ముఖ్ కి దీప్తి బ్రేకప్ చెప్పింది. అప్పటి నుండి తెగ సందడి చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది.బంగార్రాజు సినిమా పాటకి తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ మంత్ర ముగ్ధుల్ని చేసింది.

deepthi sunaina dance for bangarraju Song
Deepthi Sunaina : అదరగొట్టేసింది..
ఈ అమ్మడి క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగ్, చైతూ. జనవరి 14న విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి ఆడిపాడింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ ముగియడంతో జీ 5లో స్ట్రీమింగ్ చేశారు.
View this post on Instagram