Intinti Gruhalakshmi 25 July Today Episode : తులసి రుణం తీర్చుకున్న సామ్రాట్..! దగ్గర ఉండి తులసి ప్రాజెక్ట్ చుస్కొమని నందు, లాస్య కు ఆర్డర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 25 July Today Episode : తులసి రుణం తీర్చుకున్న సామ్రాట్..! దగ్గర ఉండి తులసి ప్రాజెక్ట్ చుస్కొమని నందు, లాస్య కు ఆర్డర్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 July 2022,9:30 am

Intinti Gruhalakshmi 25 July Today Episode : ఏమో అనుకున్నా కానీ ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు నిజంగా ఎంతమంది సామ్రాట్ లు ఉంటారు అని నేను అనుకోలేదు అని వాళ్ళ బాబాయ్ చెబుతుండగా.. సామ్రాట్ మాత్రం దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.. సామ్రాట్ సామ్రాట్ అని పెద్దగా అనగానే.. ఏదేమైనా తను సూపర్ బాబాయ్ తన ఆటిట్యూడ్ కి ఆలోచన విధానికి 100 కి 100 మార్క్స్ ఇవ్వచ్చు బాబాయ్.. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఇంటర్ రాలేదు ఎవరికి అప్పుడే హండ్రెడ్ మార్క్స్ వేస్తున్నావ్ అని వాళ్ళ బాబాయ్ అడగగా.. తులసికి అని సామ్రాట్ చెప్తాడు.. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చేతిలో ఒక బ్లాంక్ పెడితే అదేదో చిత్తు కాగితం లాగా నా మోహన విసిరి కొట్టింది బాబాయ్ తులసి కాకుండా ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఒకటి తర్వాత 100 సున్నాలు పెట్టుకునేవారు.. ఇప్పటివరకు నేను డబ్బు మనుషుల్ని చూశాను బాబాయ్ తులసి లాంటి క్యారెక్టర్ ఉన్న వారిని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను..! తులసి ఇంటర్వ్యూ కోసం నందు, లాస్య ఆధ్వర్యంలో సామ్రాట్ కండక్ట్ చేస్తున్న ఇంటర్వ్యూకు వస్తుంది.. తులసి రావటం చూసినా నందు, లాస్య వాళ్లే ముందుగా వెళ్లి తన ఫైలు చెక్ చేస్తారు..

ఏంటి సంగీతం స్కూలు కూడా ఓ బిజినెస్ ఐడియానేనా.. ఇంకా నయం బట్టలు ఉతకడం అంటే ఐడియాలతో రాలేదు.. అని లాస్య వెటకారం చేస్తుంది.. ఇక్కడ నీ ఐడియా ఓకే చేసి నందునే సార్ దగ్గర వరకు పంపించాలి. నీ లైఫ్ లో ఎప్పుడూ ఇలాంటి పోసిషన్ వస్తుంది అని అనుకోలేదు కదా.. నువ్వు మాజీ భార్య అని అందరిని కాదని నిన్ను ఏమి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం.. నువ్వు అందరికి మల్లె వెయిట్ చెయ్ అని లాస్య అంటుండగా నందు మౌనంగా ఉండిపోతాడు.. ఇక తులసి అక్కడే సోఫాలో కూర్చుని ఉండిపోతుంది.. అంతలో తులసిని చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఏమ్మా తులసి ఇలా వచ్చావు అని అడుగుతాడు.. ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని చెబుతుంది. సరే రా సామ్రాట్ దగ్గరకు తీసుకు వెళ్తాను అని అంటాడు. లేదు అందరికీ లాగానే నేను కూడా వెయిట్ చేస్తాను అని అంటుంది . సామ్రాట్ నిన్ను ఎక్కడ చూస్తే తనే డైరెక్ట్ గా సామ్రాట్ నీ దగ్గరకు వస్తాడు.. అది ఏ మాత్రం బాగోదు ఒకసారి నువ్వే ఆలోచించుకొని అంటాడు.. ఇక సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ని పిలుస్తాడు అంతలో నందు లాస్యతో సామ్రాట్ మాట్లాడుతూ బిజీగా ఉంటాడు..

intinti gruhalakshmi 25 july 2022 full episode

intinti gruhalakshmi 25 july 2022 full episode

తులసిని చూడగానే వాట్ ఏ ప్లసంట్ సర్ప్రైజ్ మీరు వచ్చారా అని అడుగుతాడు.. మన యాడ్ చూసి తులసి వచ్చిందట అని చెబుతాడు.. మీరు మీటింగ్ లో ఉన్నారు అనుకుంటా నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. తులసి గారు మీ బిజినెస్ ఐడియా ఏంటి చెప్పండి అని సామ్రాట్ అడుగుతాడు నేనొక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని తులసి చెబుతుంది దానివల్ల ఎవరికి ఉపయోగం సార్ అని రాసి ఉంటుంది సంగీతం కి పశువులు, పక్షులు, మనుషులు అందరూ పరవశిస్తారని ఉంటుంది ఈ విషయం తెలియకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని తులసి అంటుంది.. ఐ అగ్రీ.. సంగీతం అనేది ఓంకారం నుండి మొదలైంది.. విష్ణుమూర్తి అవతారాలలో ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తాడు.. శివుడు డమరుకం వాయిస్తాడు చదువుల తల్లి సరస్వతి వీణ వాయిస్తోంది.. చదువులు పెరుగుతున్న ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతం గురించి ఎవరికీ తెలియదు..

అది మన దురదృష్టం.. అలాంటి పరిస్థితి మార్చాలి అన్నది నా ఉద్దేశం.. గంగా నదిలో మునిగితే గాని దాని విలువ పవిత్రత తెలియదు.. అలాగే మనం ఈదిదైతే కానీ మనం ఏం పోగొట్టుకుంటున్నామో తెలియదు.. అంతేకాదు సార్ సంగీతం రావడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇవన్నీ మనిషికి ఉపయోగపడేవే.. అని తులసి చెప్పగానే.. సామ్రాట్ వావ్ నిజంగా నాకు కావాల్సింది ఇలాంటి ప్రాజెక్ట్స్.. లుక్ మిస్టర్ నందు మీరేం చేస్తారో నాకు తెలీదు అర్జెంటుగా తులసి ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి.. స్వయంగా మీరే ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి అమలు చేయాలి.. తులసి గారి సలహాలు తీసుకోండి అని నందుకు చెప్తాడు బాబాయ్ ఎందుకు అవసరమైన అమౌంట్ ను వెంటనే అరేంజ్ చేయండి నా కల తీరేలా చేసినందుకు ధన్యవాదాలు.. వస్తాను సార్ అని వెళ్తుంది.. లేదు నా కల తీర్చుకుంటున్నాను అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది