Jabardasth New Judge : జబర్దస్త్‌ కి కొత్త జడ్జ్‌.. వివాదాస్పద సీనియర్ కమెడియన్‌ తో చర్చలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth New Judge : జబర్దస్త్‌ కి కొత్త జడ్జ్‌.. వివాదాస్పద సీనియర్ కమెడియన్‌ తో చర్చలు

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2022,1:40 pm

Jabardasth New Judge ; ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో పర్మినెంట్ జడ్జ్ కనపడడం లేదు. షో ఆరంభంలో నాగబాబు మరియు రోజాలు జడ్జ్ సీటులో కూర్చున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత నాగబాబు వెళ్లి పోయాడు. ఆయన స్థానంలో పలువురు వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా పర్మినెంట్‌ జడ్జ్‌ అవ్వలేక పోయారు. కానీ సింగర్ మనో ఎక్కువ కాలం జబర్దస్త్‌ యొక్క జడ్జ్‌ స్థానంలో కొనసాగాడు. ఈ మధ్య కాలంలో ఆయనకు చెన్నై నుండి రావడానికి వీలు పడడం లేదట. అందుకే జబర్దస్త్ కొత్త జడ్జ్ గా కృష్ణ భగవాన్ వస్తున్నాడు…

ఆయన కూడా కొన్ని కారణాల వల్ల షో కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది. ఈ సమయంలో జబర్దస్త్ కోసం కొత్త జడ్జ్‌ రాబోతున్నాడు అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈసారి రాబోతున్న కొత్త జడ్జ్‌ గురించి ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగానే చర్చ జరుగుతోంది. ఆయన మరెవరో కాదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి. ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయింది.. కానీ కొన్ని కారణాల వల్ల వివాదాస్పదమయ్యాడు…

Jabardasth comedy show new judge is coming next weeks

Jabardasth comedy show new judge is coming next weeks

అంతే కాకుండా ఆయన రాజకీయంగా కూడా విమర్శలను ఎదుర్కొన్నాడు. దాంతో సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలో రాజకీయాల్లో అడుగు పెట్టడం తో కెరీర్ నాశనం చేసుకున్నాడు. పృథ్వీ ఇప్పుడు జబర్దస్త్ జడ్జ్ గా రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 2023లో జబర్దస్త్ కి కొత్త జడ్జ్‌ రావడం పక్కా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. మరో జడ్జ్ గా ఇంద్రజ కొనసాగుతున్నారు…@

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది