Samantha : మహిళలు చేస్తే తప్పు.. మగవాళ్లు చేస్తే తప్పు కాదా… సమంత సంచలన పోస్ట్..!
Samantha : ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన టాపికే. వాళ్లు విడిపోవడం పక్కన పెడితే.. నెటిజన్లు, తెలుగు సినిమా అభిమానులు, చై అభిమానులు, సామ్ అభిమానులు.. సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. ఇందులో ఎవరి తప్పు.. అంటూ పర్సనల్ గా వెళ్లి మళ్లీ కామెంట్లు పెడుతున్నారు.సమంత ఎప్పుడైతే తన ఇంటి పేరు అక్కినేనిని సోషల్ మీడియాలో తొలగించిందో అప్పటి నుంచే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవలే ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి వాళ్లు ఏం పోస్ట్ చేసినా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.ను షేర్ చేసే పోస్టులను చూస్తేనే తను ఎంతగా బాధపడుతుందో.. ఎంతగా మెంటల్ గా టెన్షన్ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇన్ స్టా స్టోరీని షేర్ చేసింది సామ్. ఆ స్టోరీ సారాంశం ఏంటంటే.. మహిళలు ఏం చేసినా కూడా అందరూ ప్రశ్నిస్తారు. నైతికత గురించి అడుగుతారు.
Samantha : ఇన్ స్టా స్టోరీని షేర్ చేసిన సమంత
తమరి అదే పని పురుషులు చేస్తే అడిగే వాళ్లు ఏరి? అప్పుడు నైతికత గురించి ఎవ్వరూ అడగరు ఎందుకు. ఎక్కడున్నాం మనం. అటువంటి సందర్భంలో.. మన సమాజంలో నైతికత ఎక్కడ ఉంది.. అంటూ స్టోరీని ఇన్ స్టాలో షేర్ చేసింది సమంత.
తన విడాకుల విషయంపై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. కొందరు నాగ చైతన్యది తప్పు అంటే.. మరికొందరు సమంతదే తప్పు అంటున్నారు. ఏది ఏమైనా.. వారి విడాకుల విషయం పర్సనల్ కాబట్టి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా.. వాళ్ల విడాకుల వ్యవహారాన్ని ఇంతలా రచ్చ చేయడం ఏంటి.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.