Rajinikanth : రజనీకాంత్ ఇంట్లో దొంగతనం.. 3 లక్షలు పోయాయంటే 3 కోట్లు దొరికాయి
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. అది మామూలుది కాదు.. 3 కోట్ల రూపాయల విలువైన దొంగతనం. కానీ.. మా ఇంట్లో విలువైన వస్తువులు పోయాయి. వాటి విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటాయి అని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఐశ్వర్య. తన ఫ్లాట్ లో ఉన్న నగలు మిస్ అయ్యాయి. తన నగలు ఉండే లాకర్ గురించి కూడా తన పనిమనిషికి తెలుసు అట. ఆమెకు తప్ప ఇంకెవ్వరికీ ఆ నగల గురించి తెలియదు
అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య. డ్రైవర్ వెంకటేష్.. తన ఫ్లాట్ లో ఈశ్వరి, లక్ష్మి ఇద్దరూ పని మనుషులుగా ఉన్నారు. ఈ ముగ్గురి వల్లనే ఆ దొంగతనం జరిగి ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేసింది ఐశ్వర్య. తన డ్రైవర్, పనిమనుషులు ఈశ్వరి, లక్ష్మీ ఈ ముగ్గురి మీదనే ఐశ్వర్యకు అనుమానం వచ్చినా.. ఆమె మాత్రం డైరెక్ట్ గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ ముగ్గురిని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే వీళ్లు ఒకసారి కాదు.. దాదాపు మూడు నెలల నుంచి ఐశ్వర్య ఇంట్లో ఒక్కొక్కటి కొట్టేస్తున్నారు.
Rajinikanth : నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఐశ్వర్య
తన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఒక్కొక్కటిగా కొట్టేశారు. 60 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వజ్రాభరణాలు, 4 కిలోల వెండి వస్తువులను ఐశ్వర్య నుంచి లేపేసి.. కొన్ని ఆభరణాలను ఆమ్మేసి చెన్నై అవుట్ స్కర్ట్ లో మూడు ఫ్లాట్స్ కూడా తీసుకున్నారు వాళ్లు. మొత్తం 3 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు. 3 లక్షల విలువైన వస్తువులే పోయాయి అంటే.. ఏకంగా 3 కోట్ల విలువైన వస్తువులు బయటపడ్డాయి. ఐశ్వర్యకు సంబంధించిన ఓ భూమి పత్రాలను కూడా ఈశ్వరి కొట్టేసిందట. వీళ్లు చేసిన పని చూసి ఐశ్వర్య మాత్రం షాక్ అయిందట.
