RRB Constable Job : గుడ్ న్యూస్.. భారీగా RRB కానిస్టేబుల్ ఉద్యోగాలు .. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..!
ప్రధానాంశాలు:
RRB Constable Job : గుడ్ న్యూస్.. భారీగా RRB కానిస్టేబుల్ ఉద్యోగాలు .. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..!
RRB Constable Job : తాజాగా ఆర్ఆర్ బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2024 4660 కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ 2024 రిక్రూట్మెంట్ కింద కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుగుతుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైటు ద్వారా RPF రిక్రూట్మెంట్ 2024 కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఏప్రిల్ 15 నుండి మే 14 , 2024 వరకు దరఖాస్తు చేయవచ్చు. RPF రిక్రూట్మెంట్ 2024 అర్హత, వయోపరిమితి, దరఖాస్తు రుసుము మరియు మొత్తం సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను ఒకసారి తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ కి 4660 కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. అందులో కానిస్టేబుల్ కు 4208,సబ్ ఇన్ స్పెక్టర్ కు 452 పోస్టులు భర్తీ అయ్యాయి.
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 14 వరకు ఉంది. ఇక ఈ జాబ్ లకు ఎంపికైన వారికి ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం రావచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళలు, మైనారిటీలు అభ్యర్థులకు రూ. 250 ఫీజు కలదు. ఇక ఈ పోస్టులకు వయోపరిమితి కలదు. కానిస్టేబుల్ ఉద్యోగానికి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 28 సంవత్సరాలు ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ల కోసం కనీస వయసు 20 సంవత్సరాలు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి.
RRB RPF కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఆర్ఆర్బి ల అధికారిక వెబ్సైట్ rpf.indianrailways.gov.in లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలో RRB RPF రిక్రూట్మెంట్ 2024 కోసం అందుబాటులో ఉన్న లింకుపై క్లిక్ చేయాలి. కొత్త విండో తెరుచుకుంటుంది. వెంటనే లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించాలి. వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో కొనసాగాలి మరియు దరఖాస్తు ఫారం పూరించాలి. దరఖాస్తు రుసుము చెల్లించి ఫారంను ఆన్లైన్లో సమర్పించాలి. నిర్ధారణ పేజీని డౌన్లోడ్ చేసి తదుపరి సూచన కోసం దానిని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.