Telangana congress : నేనంటే నేనంటూ కొట్టుకు చస్తున్న టీ కాంగ్రెస్ నాయకులు.. వీళ్లు ఇంకా మారరా?
Telangana congress : తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పాదయాత్ర చేయాలి అనేది సెంటిమెంట్ గా వస్తుంది. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ లు సుదీర్ఘ పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. అందుకే కొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్న వారు అయితేనం పాత పార్టీల వారు అయితేనేం ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా పార్టీ పెట్టకుండానే షర్మిల తాను చేవెళ్ల నుండి పాదయాత్ర చేయబోతున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నాడు. అందుకు సంబంధించి కేంద్ర నాయకత్వం వద్ద అనుమతికి దరకాస్తు కూడా పెట్టాడు. కాని ఇప్పటి వరకు అధినాయకత్వం నుండి ఎలాంటి రిప్లై రాలేదు.
Telangana congress : పార్టీలో ఆదిపత్యపోరు…
రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటే మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పాదయాత్రలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఉత్తమ్ తో పాటు మరి కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాదయాత్ర మేము చేస్తాం మాకు అనుమతి ఇవ్వండి. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తాను అంటున్నారు. పార్టీకి ఎవరు ఎంత మేరకు ఉపయోగపడుతారు అనే విషయంలో కేంద్ర నాయకత్వం స్పష్టంగా ఉంది. అందుకే అనుమతుల విషయంలో ఆలస్యం చేస్తున్నారు. ఒక్కరికి ఛాన్స్ ఇస్తే ఇతరులు అలిగే అవకాశం ఉంది. తద్వారా ఏకంగా పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే జాతీయ నాయకత్వం పాద యాత్ర అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాజకీయంగా కాంగ్రెస్ పరిస్థితి అంత బాగాలేదు. ఆ కారణంగానే రాజకీయ నాయకులు పలువురు తాను అధికారంలోకి పార్టీని తీసుకు వస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు.
Telangana congress : రేవంత్ ను అనుమతించొద్దు…
రేవంత్ రెడ్డి వైపు బలమైన వర్గం ఉన్న కారణంగా ఆయన్ను పీసీసీ చేయడంతో పాటు ఆయనకు పాద యాత్ర చేసే అనుమతులు ఇవ్వాలంటూ కొందరు కోరుకుంటున్నారు. కాని ఎక్కువ మంది నాయకులు మాత్రం ఆయన ఈమద్య వచ్చాడు. ఎందుకు ఆయనకు అలాంటి పదవి ఇస్తారు అంటున్నారు. ఆయన కంటే సీనియర్ లు ప్రజామోదం కలిగిన వ్యక్తులు నాయకులు ఉన్నారు. వారు పాదయాత్ర చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను వీహెచ్ వంటి నాయకులు వ్యక్తం చేస్తున్నారు .అందుకే రేవంత్ రెడ్డి విషయంలో నాయకులు నిర్ణయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకున్నా కనీసం రెండవ స్థానంలో నిలవాలన్నా కూడా ఖచ్చితంగా పాదయాత్ర చేయాల్సి ఉంది. కాని పాద యాత్ర విషయంలో నాయకులు రచ్చ చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో జాతీయ నాయకత్వం అసలు పాద యాత్రకు ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.