దితెలుగున్యూస్ వెబ్ సైట్ సర్వే పోల్ : నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?
ప్రధానాంశాలు:
దితెలుగున్యూస్ వెబ్ సైట్ సర్వే పోల్
నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?
Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జాతీయ పార్టీలు అయితే జాతీయ నాయకులతో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నాయి. ఇక.. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. నకిరేకల్ నియోజకవర్గం మరో ఎత్తు. అక్కడి రాజకీయాలే చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా గెలిచింది మాత్రం వామపక్ష పార్టీలే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిచింది. 2009 లో నకిరేకల్ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్ కేటాయించగా.. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య గెలుపొందారు.
2014 లో చిరుమర్తిని ఓడించి టీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల వీరేశం గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ 2018 లో వేముల వీరేశాన్ని ఓడించి చిరుమర్తి లింగయ్య మరోసారి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చిరుమర్తి లింగయ్య పోటీలో ఉండగా.. బీజేపీ నుంచి నకిరేకంటి మొగులయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం బరిలో ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం 2,33,620 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,16,874 మంది పురుషులు ఉండగా, 1,16,744 మంది మహిళలు ఉన్నారు.
మరి.. ఈసారి నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన చిరుమర్తిని మరోసారి గెలిపిస్తారా? లేక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వేముల వీరేశాన్ని గెలిపిస్తారా? లేక బీజేపీ అభ్యర్థి నకిరేకంటి మొగులయ్యను గెలిపిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు. దీనిపై దితెలుగున్యూస్ thetelugunews.com వెబ్ సైట్ సర్వే పోల్ నిర్వహిస్తోంది. ఈ సర్వే పోల్ లో మీరు కూడా పాల్గొనవచ్చు. మీరు నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అయితే చాలు. నకిరేకల్ లో గెలుపు ఎవరిదో ఈ కింది పోల్ ద్వారా మీ ఓటును వేసి మాకు తెలియజేయండి.ఈ సర్వే పోల్ ఫలితాలను నవంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రం ప్రకటించబడును.
[poll id=”3″]