Hair Tips : పది రూపాయల జపనీస్ కెరోటిన్ సీక్రెట్ ఎంత ఖర్చు చేసిన రాని ఫలితం పది రూపాయలకే…!
Hair Tips : చాలామంది జుట్టు కోసం ఎన్నో రకాల ఆయిల్స్, షాంపూలు కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వేలకి వేల ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని వాడిన కానీ ఎటువంటి రిజల్ట్ కనిపించదు. అలాంటి వాళ్లకి ₹10 తో ఇంట్లోనే కెరోటిన్ చికిత్స చేసుకోవచ్చు. దాని కోసం మనకి కావలసినవి బెండకాయలు ఎనిమిది కేవలం. బెండకాయతో ఈ ప్యాక్ తయారు చేసుకున్నట్లయితే మీ జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది. జీవం లేకుండా ఉన్న జుట్టు […]

Hair Tips : చాలామంది జుట్టు కోసం ఎన్నో రకాల ఆయిల్స్, షాంపూలు కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వేలకి వేల ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని వాడిన కానీ ఎటువంటి రిజల్ట్ కనిపించదు. అలాంటి వాళ్లకి ₹10 తో ఇంట్లోనే కెరోటిన్ చికిత్స చేసుకోవచ్చు. దాని కోసం మనకి కావలసినవి బెండకాయలు ఎనిమిది కేవలం. బెండకాయతో ఈ ప్యాక్ తయారు చేసుకున్నట్లయితే మీ జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది. జీవం లేకుండా ఉన్న జుట్టు పట్టు లాగా మారుతుంది 8 బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకుని తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకుని ఓ బౌల్లో గ్లాసు నీళ్ళని పోసి స్టవ్ పై పెట్టి గోరువెచ్చగా కాగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని దాంట్లో వేసి ఐదు నిమిషాలు పాటు బాగా మరగబెట్టుకోవాలి.
బెండకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో ఉండే జిగురు అంతా నీటిలోకి వస్తుంది. తర్వాత స్టవ్ ఆపి దానిని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తో వడపోసుకోవాలి. తదుపరి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక గిన్నెలో కలుపుకొని దానిలో వేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర అయ్యేంతవరకు ఐదు నిమిషాల వరకు బాగా కలుపుతూ మరిగించుకోవాలి. తదుపరి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక స్పూను ఆముదం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆముదం లేకపోతే ఏదైనా ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని డ్రై హేర్ లేదా ఆయిల్ హెయిర్ మీద బాగా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకునేటప్పుడు జుట్టుని చిన్నచిన్న భాగాలుగా చేసుకొని కుదురుల నుంచి చివర్ల వరకు బాగా రాసుకోవాలి.
అలా పెట్టుకున్న తర్వాత 40 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాల వరకు బాగా ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా గాడ్త తక్కువ గల షాంపూని తీసుకొని తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు మృదువుగా సిల్కీగా మారుతుంది. చాలామంది వేలవేల ఖర్చులు చేస్తూ.. పార్లర్కి వెళ్లి కెరీర్ ట్రీట్మెంట్ తీసుకున్న కూడా అంత మంచి ఫలితం ఉండదు. ఈ ప్యాక్ ని పెట్టడానికి ముందు నిర్జీవంగా ఉన్న మీ జుట్టుని ఈ మిశ్రమాన్ని అప్లై చేయగానే జుట్టు పట్టు లాగా మెరిసిపోతూ ఉంటుంది. జుట్టుని పట్టుకుంటే షైనీగా, మృదువుగా జారిపోతూ ఉంటుంది. ఇలాంటి ట్రీట్మెంట్ పార్లర్ కెళ్ళి ఎంత ఖర్చు చేసినా దొరకని ఫలితం ఇంట్లోనే పది రూపాయలకు దొరుకుతుంది.