Aloe Vera : కలబందతో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!
ప్రధానాంశాలు:
Aloe Vera : కలబందతో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా...!
Aloe Vera : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ ముఖం మెరుస్తూ మంచి నిగారింపుతో ఉండాలి అని కోరుకుంటారు. దీనికి ఇంట్లో ఉండే పదార్థాలతో కలబందను కలుపుకొని ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. అయితే మెరిసే చర్మం కోసం చిటికెడు పసుపు మరియు ఒక చెంచా పాలు, మరి కొంచెం రోజు వాటర్,ఒక చెంచా తేనె ఈ పదార్థాలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కలబంద గుజ్జును కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ముఖానికి మరియు మెడకి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది అని సౌందర్య నిపుణులు అంటున్నారు…
కొంతమందికి చర్మం అనేది ఎంతో జిడ్డుగా ఉంటుంది. అయితే వీరిని ఎక్కువగా మొటిమలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటివారు కలబంద ఆకులను నీళ్లలో వేసి కొద్దిసేపు మరిగించి దానిని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొద్దిగా తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా గనక మీరు వారానికి ఒక్కసారైనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ముఖంపై ఎప్పుడు వచ్చే మొటిమలతో అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ మొటిమలను మరియు మచ్చలను నియంత్రించడంలో కలబందను మించింది మరొకటి లేదు అని నిపుణులు అంటున్నారు…
మొటిమల సమస్యతో బాధపడేవారు మొటిమలు ఉన్న దగ్గర కలబంద గుజ్జులో రెండు చుక్కల గులాబీ నూనెను కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు అలా వదిలేయాలి. ఇది చర్మానికి ఎంతో పోషణను ఇస్తుంది. అయితే మనం ఎక్కువగా ఎండకు గురైనప్పుడు చర్మంపై ట్యాన్ అనేది ఏర్పడుతుంది. అయితే దీనికి కలబంద గుజ్జును తీసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న దగ్గర రాయాలి. ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. అయితే దీంతో కేవలం ట్యాన్ మాత్రమే కాదు మొటిమలు కూడా తగ్గుతాయి అని అంటున్నారు నిపుణులు…