Hair Tips : ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్ కలర్.. తెల్ల వెంట్రుకలన్నీ క్షణాల్లోనే నల్లగా మారుతాయి!
Hair Tips : తెల్లజుట్టు సమస్య ఉన్న వారు జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఇంట్లోనే మంచి హెయిర్ కలర్ ను తయారు చేసుకోవచ్చు. దాని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా కావాలంటే ఈ చిట్కాను కచ్చితంగా పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఒక ఐరన్ పాన్ ని తీసుకొని దానిలో 2 స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల గుంటగలగరాకు పొడి వేసుకోవాలి. […]
Hair Tips : తెల్లజుట్టు సమస్య ఉన్న వారు జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఇంట్లోనే మంచి హెయిర్ కలర్ ను తయారు చేసుకోవచ్చు. దాని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా కావాలంటే ఈ చిట్కాను కచ్చితంగా పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఒక ఐరన్ పాన్ ని తీసుకొని దానిలో 2 స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల గుంటగలగరాకు పొడి వేసుకోవాలి. దీనినే బ్రింగరాజ్ అని కూడా అంటారు. ఇందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన పసుపు వేసుకోవాలి. వీటన్నింటిని నల్లగా మారేంత వరకు వేయిస్తూ.. ఉండాలి. ఉసిరి పొడి జుట్టు పొడవుగా నల్లగా ఉండేందుకు సహాయ పడుతుంది.
అందరికీ తెలిసిందే ఉసిపి పొడి విటామిన్ సి సాయంతో చాలా చర్మాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పొడవుగా పెరిగేందుకు, పగిలిపోకుండా, మెరుస్తూ ఉండేందుకు సహాయ పడుతుంది.అలాగే గుంటగలగరాకు కూడా జుట్టు పెరుగుదలకు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది. గుంటగలగరాకు తయారు చేసే నూనె జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. అయితే పసుపు తలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేకుండా జుట్టు రాలిపోకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు అవన్నీ బాగా మాడి నల్లగా పొడి తయారు అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఈ పొడిని ఒకగాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడైతే జుట్టుకు అప్లై చేసుకోవాలి.
జుట్టుకు పెట్టుకోవాలన్నప్పుడు కావలిసినంత మోతాదులో పొడిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దానితో అది తలకు అప్లై చేసుకునే విధంగా ఉండేలా కొబ్బరి నూనె లేదా ఆవ నూనెతో కలుపుకోవాలి. కలిపిన తర్వాత తలకు అప్లై చేయండి. జుట్టు అలాగే ఉంది అలానే తల దువ్వుకొని జుట్టుని వదిలేయవచ్చు. తన స్నానం చేయవలసిన అవసరం లేదు. ఈ ప్యాక్ జుట్టుకు సంరక్షించడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది. జుట్టుకు కావాల్సిన తేమ, పోషణ అందిస్సతూ… జుట్టు కుదుళ్లు బలంగా చేస్తుంది. జుట్టుకు మంచి నలుపు రంగు జుట్టు అందించి తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది. అయితే దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. నల్లగా, పొడవుగా, చిట్లిపోకుండా ఉంటుంది.