Beauty Tips : నల్లగా ఉన్న స్కిన్ ను పర్మినెంట్ గా తెల్లగా చేసే అద్భుతమైన చిట్కా..!
Beauty Tips : ఈ మధ్య కాలంలో చాలా మందికి అందంపై మక్కువ ఎక్కువైంది. అందరి ముందు బాగా కనిపించాలనే తపనతో బ్యూటీ పార్లర్లు, ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. తెల్లగా మారేందుకు వేలకు వేలు ఖర్చు చేస్తూ.. అనేక రకాల ఫేస్ క్రీములు కొనుక్కుంటున్నారు. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంట్లోనే ఓ అద్భుతమైన చిట్కాను ఉపయోగించి మీ రంగును తెల్లగా చేసుకోండి. నల్లగా ఉన్నా, కాస్త ఛామన ఛాయ రంగులో ఉన్న తెలతలా మెరిసిపోయేలా చేస్తుంది. అయితే ఆ అద్భుతమైన చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బీట్ రూట్ ను తీస్కొని.. దాని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేస్కొని మొత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీన్ని వడకట్టి దీని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని… స్టవ్ మీద పెట్టి కొంచెం కలర్ మారేంత వరకు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఇది మరి కొంచెం గోరు వెచ్చగా అయిన తర్వాత దీనిలో ఒక కప్పు వరి పిండి కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కలిపే సరికి డ్రగా అయిపోతుంది. అప్పుడు దీన్ని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి జల్లించడం వల్ల మెత్తని పిండి వస్తుంది. దీన్ని గాజు గ్లాసులో నిల్వ చేసుకొని నెల వరకూ స్టోర్ చేసుకోవచ్చు. ఇది నాచురల్ బాత్ పౌడర్. దీన్ని ఎలా వాడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పౌడర్ ను రెండు చెంచాలు తీస్కొని దీనిలో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇది చర్మానికి అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకునే విధంగా కలుపుకొని ఉండాలి. దీన్ని బాడీ మొత్తం రాసుకొని నెమ్మదిగా మసాజ్ చేయాలి. దీనిని మసా్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ దీనితో స్నానం చేయడం వల్ల శరీరం మొత్తం రంగు వస్తుంది. తర్వాత ముఖానికి అప్లై చేయాలి అనుకుంటే దీనిలో ఒక స్పూన్ పాలు, స్పూన్ అలోవెరా జెల్ కలిపి మొకానికి ప్యాక్ లా వేసుకోవాలి.ఆరిన తర్వాత వాటర్ తో మసాజ్ చేస్తూ… రిమూవ్ చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ఎంత నల్లగా ఉన్న వాళ్లు అయినా తెల్లగా మారిపోతారు. మీరూ ఓసారి ట్రై చేయండి.