Diabetes : ఇక ఆ భయం అక్కర్లేదు… అందుబాటులోకి వచ్చిన సరికొత్త షుగర్ టెస్ట్ పరికరం…
Diabetes : ప్రస్తుతం చాలామంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవన శైలిలో వచ్చిన మార్పులు, తినే ఆహారంలో పోషకాలు లోపించడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా ఎన్నో కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రపంచం మొత్తంలో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా మన ఇండియాలోనే ఉన్నారు. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ ఎంతోమంది చక్కెర వ్యాధితో బారిన పడుతున్నారు. అయితే చాలామంది దీనిని ముందుగా గుర్తించలేరు. తరువాత తగ్గించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇకపై అలాంటి వారికి ఏ టెన్షన్ లేదు.
ఎందుకంటే డయాబెటిస్ టెస్ట్ కోసం సరికొత్త పరికరాన్ని ఆంధ్రా యూనివర్సిటీ ఆవిష్కరించింది. టైప్ 2 డయాబెటిస్ ను ఈ పరికరం సెకండ్లలో గుర్తిస్తుంది. ఒక రక్తపు చుక్కతో ఫలితాలు వస్తాయి అంటున్నారు. బయో ఫ్యాబ్రికేషన్ తో టెస్టింగ్ తయారీ ఆరు నెలలపాటు స్ట్రిప్ ను ఉపయోగించుకునే వెసులు బాటు ఉంటుంది అంటున్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగింది. కారణాలు ఏవైనాప్పటికీ ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులున్నాయా వాడాల్సిందే. డయాబెటిస్ ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన అది ప్రాణాంతకంగా మారుతుంది.
అందుకు షుగర్ రోగులు క్రమం తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్స్ చెబుతుంటారు. అయితే చక్కెర వ్యాధి పరీక్ష కోసం ఉపయోగించే పరికరాలు కాస్త ఖర్చుతో కూడుకున్నవి. ఈ క్రమంలో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ కొత్త పరికరంతో టైప్ 2 డయాబెటిస్ ను సెకండ్లలో తెలుసుకోవచ్చు. పైగా ఈ పరికరం అత్యంత చవకైనవి. ఈ పోర్టబుల్ నానో బయో సెన్సార్ పరికరాన్ని ఆంధ్ర యూనివర్సిటీ రూపొందించింది. ఇది చూడ్డానికి ఓ పెన్ డ్రైవ్ లా కనిపిస్తుంది. ఇందులో వినియోగించే టెస్టింగ్ స్ట్రిప్లను బయో ఫ్యాబ్రికేషన్ తో తయారు చేశారు. వీటిని ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు.