Kidney Stones : కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ మూడు జ్యూసులతో వాటికి చెక్ పెట్టవచ్చు…
Kidney Stones : చాలామంది కిడ్నీలలో రాళ్లు వస్తూ ఉంటాయి. ఈ సమస్యకి వయసుతో సంబంధం లేదు.. ఈ సమస్య ఎవరిలోనైనా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య తగ్గించుకోవడానికి కొన్ని రకాల జ్యూస్ లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. కిడ్నీకి సంబంధించిన సమస్య చాలా ఇబ్బందికరమైనది. ఈ సమస్యలో కిడ్నీలలో రాళ్లు సమస్య ఒకటి. కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు నొప్పిని తట్టుకోలేక పోతూ ఉంటారు. కిడ్నీలలో రాళ్లు రావడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన డైట్ ప్లాన్ మార్చుకోవడం చాలా ప్రధానం. అలాగే కొన్ని జ్యూసులను తాగడం వలన ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మీరు కిడ్నీలలో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే ఈ మూడు రకాల జ్యూస్ ని మీ డైట్ లో చేర్చుకోవడంవలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో సహా ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడవచ్చు… ఈ జ్యూసులు నిత్యం తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళే కాకుండా ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆ జ్యూస్లు ఏంటో ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి జ్యూస్ : తులసి ఆకులతో చేసిన జ్యూస్ కిడ్నీలలో రాళ్ల సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇలాంటి సమయంలో తులసి ఆకుల రసాన్ని తీసి దాన్లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి తయారు చేసిన మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం తీసుకోవాలి.ఈ విధంగా చేయడం వలన కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు..
టమోటా జ్యూస్ : కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టమోటా జ్యూస్ బాగా సహాయపడుతుంది. ఈ స్థితిలో రెండు టమాటాలు బాగా కడిగి వాటిని జ్యూస్లా తయారు చేసుకుని దానిలో మిరియాల పొడి ఉప్పు కలుపుకుని తీసుకోవాలి. ఈ జ్యూస్ ని ఫ్రిజ్లో పెట్టుకొని తర్వాత కూడా తీసుకోవచ్చు.. నిమ్మ రసం : నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ నిమ్మరసం తీసుకోవడం వల్ల ఈ సమస్య తొందరగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి ఇప్పుడు రుచికి అనుగుణంగా ఒప్పు కలిపి తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు…