Health Problems : తస్మాత్ జాగ్రత్త ఈ వైపు నిద్రిస్తే గుండె సమస్యలు, కడుపులో సమస్యలు తప్పవు…!!
Health Problems : సహజంగా మనం నిద్రించే సమయంలో మనకి ఎటువైపు అనుకూలంగా ఉంటే అటువైపు పడుకొని నిద్రిస్తూ ఉంటాం. అయితే మన ఆరోగ్యం మన నిద్రపోయే ఆధారపడి ఉంటుంది. మంచి నిద్రను నిద్రిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. మంచి నిద్ర నిద్రించడం వలన శరీరం రి ఫ్రెష్ గా తయారవుతుంది. దీని కారణంగా మరునాడు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. అయితే రాత్రి సమయంలో పడుకునే పొజిషన్ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చాలామందికి తెలియదు. ఎడమవైపు పడుకుంటే ఏం జరుగుతుంది. కుడివై పడుకుంటే ఏం జరుగుతుంది ఎలాంటి ఆరోగ్య ఉపయోగాలుంటాయి.
ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం… *గుండె ఆరోగ్యంగా ఉంటుంది; ఎడంవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మీ గుండెపై ఎటువంటి ఒత్తిడిని కలిగించదు. దీని వలన గుండెకు రక్తం సరిగా అందుతుంది. కావున ఈ వైపు నిద్రించడం వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. *జీర్ణ క్రియపై ఎఫెక్ట్: ఇప్పుడు వైపు ఎక్కువగా నిద్రిస్తే ఈ రోజే అలవాటుని మానుకోండి. కుడివైపు కాకుండా ఎడం వైపు పడుకోవడం వలన పేగులు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎడమవైపు పడుకోవడం
ఉన్న జీర్ణ క్రియ కూడా సరిగ్గా జరుగుతుంది. శరీరంలోని వ్యర్ధ పదార్థాలు ఈజీగా బయటికి వెళ్లిపోతాయి. *వెన్ను నొప్పి నుండి ఉపశమనం: పడుకోవడం వలన నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఈ స్థితిలో వెన్ను పాముకు సపోర్ట్ ఉంటుంది. దీని కారణంగా వెనక భాగంలో తక్కువ భారం పడుతుంది. *ఆక్సిజన్ రక్తం శరీర అవయవాలకు సరిగ్గా చేరుతాయి: ఎడమ వైపు నిద్రించడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలకు మెదడుకు రక్తం ఆక్సిజన్ సక్రమంగా ఉంటుంది. ఉదయం ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరం అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి.