Beauty Tips : ఇది వాడితే ఒక్క రాత్రిలో మెరిసిపోయే ముఖం మీ సొంతం..!
Beauty Tips : చాలా మందిని ముఖంపై మొటిమలు తీవ్రంగా బాధపెడుతుంటాయి. ఏ ఫంక్షన్ కు వెళ్లాలన్నా తెలియని అన్ కంఫర్ట్ ఉంటుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు, పాలిపోయినట్లుండే ఫేస్ అదో చికాకు. అలాంటి వారి కోసమే ఈ చిట్కా. ఇంట్లోనే దీనిని తయారు చేసుకుని ముఖానికి పెట్టుకుంటే మంచి సౌందర్యం సొంతమవుతుంది. మినపప్పుతో చేసుకునే ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. క్రీమ్ లా తయారు చేసుకుని చర్మ రక్షణ కోసం ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి.చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చాలా బాగా పని చేస్తుంది మినపప్పు.
ఈ మినపప్పు క్రీమును తయారు చేసుకోవడం చాలా సులభం. దాని కోసం ఒక కప్పు మినప్పప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ పప్పును శుభ్రంగా కడగాలి. దానిని మెత్తని పేస్టులాగ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్టును కాటన్ క్లాత్లో వేసి దానిని ఒక గిన్నెలో వేయాలి. ఆ వస్త్రాన్ని గట్టిగా పిండడం ద్వారా దాని నుండి పాల లాంటి నీరు వస్తుంది. ఇలా మొత్తం నీటిని పిండుకున్న తర్వాత దానిని ఒక పాన్ లో వేసుకుని స్టవ్ పై మెల్లగా వేడి చేసుకోవాలి. నీరు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ పేస్టును గాజు గిన్నెలో నిల్వ చేసుకోవచ్చు. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే మడతలు తొలిగిపోతాయి. మచ్చలు పోతాయి.
క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.ఈ పేస్టును ముఖానికి పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. చేతి వేళ్ల కొనల ద్వారా మర్దన చేసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అలా చేయడం వల్ల ముఖం కాంతి వంతంగా… అందంగా తయారవడమే కాకుండా మిల మిలా మెరిసిపోతుంది. మీ ముఖాన్ని చూసి మీరే ప్రేమలో పడొచ్చు. అలాగే చర్మాన్ని పాలిషింగ్ కోసం ఈ క్రమంలో అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని పాలిష్ చేయడంతో పాటు చర్మంలో తేమ కాపాడినట్లు అవుతుంది. దీని వల్ల చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.