Beauty Tips : రాత్రికి రాత్రే మొటిమలు మచ్చలు మాయం…!!
Beauty Tips : నేటి రోజుల్లో అందంగా, ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. చాలా మంది శరీరానికి మాత్రమే కావలసిన పోషకాలను మాత్రమే చూసుకుంటూ ఉండే తరుణంలో ముఖం గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు.. మారుతున్న జీవన శైలి అలాగే పెరుగుతున్న ఆందోళన పనుల వత్తిడి ఇవన్నీ కావచ్చు మన ముఖాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం మర్చిపోతున్నాం. మనలో ఉన్న ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతూ ఉంటుంది. ఒక మనిషి ఆత్మవిశ్వాసంగా ఉండడానికి అనేక విజయాలు సాధిస్తూ ముందుకు పోవడానికి ముఖంలో ఉన్న అందము ఆరోగ్యం కూడా ఒక పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో అందరిని ముఖ్యంగా ఆడవాళ్ళని బాధించేటువంటి సమస్య మొటిమలు ఈ మొటిమలు
తగ్గాలంటే చాలా మంది వాటిని గిల్లుతూ ఉంటారు. అవి మానడానికి తీసుకునే సమయం ఎక్కువ అవుతుంది. అవి సహజంగా ఎలా వచ్చాయో అలాగే పోయేలా చూసుకోవడం మన బాధ్యత.. మొటిమలు ఉన్నవారు మంచినీటితో తరచుగా ముఖం కడుక్కుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం మర్చిపోతున్నాం. ఏమీ లేదు కొన్ని చిట్కాలు గనుక పాటిస్తే మన శరీరంతో పాటు మన జుట్టుతో పాటు మన ముఖం కూడా చాలా అందంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూడా ఎక్కువగా స్వీట్స్ అనేవి ఉండటం వల్ల వాటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇక మేకప్ కూడా ఒక భాగంగానే పనిచేస్తుంది.
కావున ఈ మొటిమలు మచ్చలు పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… ముందుగా సెనగపిండి ప్యాక్: ముందుగా ఓ బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ శెనగపిండి, కొంచెం పసుపు, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం రోజు వాటర్ కూడా వేసి కలిపి మొహానికి వేసుకొని ఐదు నిమిషాల ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన రాత్రికి రాత్రి మీ మొటిమలు మచ్చలు మాయం. బియ్యప్పిండి ప్యాక్: ఒక స్పూన్ బియ్యప్పిండిలో ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి దాన్ని కూడా మచ్చలపై అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మీ ముఖం పై ఉన్న మొటిమలు వాటి మచ్చలు రాత్రికి రాత్రే తగ్గిపోతాయి..