Beauty Tips : పగులుతున్న మీ పెదవులకి అద్భుతమైన టిప్స్.. అవి ఇవే…!
Beauty Tips : వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చాలామందికి శరీరం ఆకారం అంతా మారిపోతూ ఉంటుంది. అలాగే ముఖము, పెదవులు, చెంపలు పగిలిపోతూ ఉంటాయి. మరి ప్రధానంగా పెదవులు నుంచి రక్తం రావడం వంటి సమస్యలు ఇంకా అధికమవుతూ ఉంటాయి. దాంతో పెదవులు పగిలిపోయి బాధపడుతూ ఉంటారు. అలాగే పెదవులు పగిలినప్పుడు ఎటువంటి చిట్కాలను పాటించడం వలన ఈ సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం చూద్దాం. పెదవులు పగిలినప్పుడు చక్కెర, తేనె వాడడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. దానికోసం పంచదార,
తేనెను మిక్స్ చేసి పెదవులకి రాసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.అదేవిధంగా కొబ్బరి నూనె కూడా పెదాలకి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. కొబ్బరి నూనె వాడడం వలన చర్మంపై తేమశాతం అధికమవుతుంది. కావున పెదవలకి కొబ్బరి నూనె అప్లై చేయడం వలన పెదవులు మృదువుగా మారి గులాబీ రంగులోకి వస్తాయి. పొడి బారిన పెదవులకు పాలు కూడా చాలా బాగా ఉపయోగపడితే దానికోసం పాలలో కాస్త కాటన్ నుంచి పెదవులపై రాయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వలన పెదవులు పొడిబారకుండా పగుళ్లు రాకుండా ఉంటాయి. అలాగే పగిలిన పెదవులకు గులాబీ రేకులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి.
దీనికోసం గులాబీ రేకులను పాలతో కలిపి పెదవులకి రాయాలి. గులాబీ రేకుల్లో ఉండే విటమిన్ ఈ పెదవులకి పోషణ అందేలా చేస్తుంది. కలమంద కూడా పెదవులకి చాలా బాగా సహాయపడతాయి. పెదవులు పగిలిన వారు కలమందను పెదవులపై పెట్టుకోవడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. రాత్రి పడుకునే ముందు కలమంద జెల్లి పెదాలకు రాసుకొని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేయడం వలన పెదవులు పింక్ కలర్ లోకి వస్తాయి.విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయలు పొడి వారిని పెదవులకి చక్కగా పనిచేస్తాయి. దానికోసం ఆముదం నూనె తీసుకొని దాన్లో కొద్దిగా నిమ్మరసం కలిపి దాన్ని పెదవులకి రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి.