Beauty Tips : ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా… ఈ కొత్త చిట్కాతో మీ ముఖం తెల్లగా నిగనిగలాడుతుంది…
Beauty Tips : చాలామంది స్కిన్ గ్లో కావడానికి వివిధ రకాల ట్రీట్ మెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. చాలా రకాల ఆయింట్ మెంట్స్ ను వాడుతారు. పార్లర్ కి వేల వేల డబ్బులను వృధా చేస్తారు. అయిన ఫేస్ లో ఎటువంటి మార్పు రాదు. అందుకే మీకు ఈ కొత్త చిట్కాను పరిచయం చేస్తున్నాం. ఈ చిట్కాను ఒకసారి మీ ముఖానికి ట్రై చేస్తే ఎంతో తెల్లగా ,కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ చర్మాన్ని అందంగా, తెల్లగా తయారుచేసుకోవచ్చు. ఈ చిట్కాను ఎక్కువగా కొరియన్స్ ఫాలో అవుతారు. అందుకే వారి చర్మం సున్నితంగా, అందంగా, తెల్లగా వుంటుంది. అయితే ఇప్పుడు ఈ చిట్కాను ఎలా తయారుచేసుకోవాలి, దానికి కావలసిన పదార్ధాలు ఏంటో చూద్దాం…
ముందుగా మనం ఉడకబెట్టిన అన్నంమును తీసుకోవాలి. దీనికోసం ఎటువంటి బియ్యానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉడకబెట్టిన అన్నాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. తరువాత అందులోకి గ్లాసు పచ్చిపాలను పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సి పట్టుకోవాలి. దీనిని ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ఆలుగడ్డను తీసుకొని దానిని తురుముకొని జ్యూస్ లాగా పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఈ జ్యూస్ ను వడగట్టుకోవాలి. మనం ముందుగా మిక్సి పట్టుకున్న దానిలో దీనిని పోసుకోవాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. తరువాత ఇందులోకి రెండు స్ఫూన్ల గోధుమపిండిని వేసుకోవాలి.తరువాత ఒక స్ఫూన్ తేనెను, కొద్దిగా కలబంద గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్సి పట్టుకోవాలి.

Beauty Tips to glowing skin to change the black skin to white skin
ఇలా తయారైనా పేస్ట్ ను ముఖానికి, మెడకు శరీరం మొత్తం రాసుకోవాలి. తరువాత కొంచెం నీటితో తడిపి ఒక పది నిమిషాలు బాగా రుద్దుతూ మసాజ్ తాగా చేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీళ్లతో బాడీ మొత్తం కడుక్కోవాలి. ఇలా చేసిన తరువాత గమనిస్తే మీ ముఖంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎక్కువసేపు మసాజ్ చేయడం వలన మీ ముఖంలో నల్ల మచ్చలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ ఫేస్ చాలా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అచ్చం కొరియన్స్ లాగా సుకుమారంగా, అందంగా, తెల్లగా తయారవుతారు. అలాగే ఈ చిట్కా వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే అన్ని ఇంట్లో వాడుకునే పదార్ధాలనే వాడాము కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.