Beauty Tips : ముఖంపై మొటిమలు పోవాలంటే… ఇలా చేయాలి…
Beauty Tips : ప్రస్తుతం చాలామంది ముఖంపై వచ్చే మొటిమలతో బాధపడుతున్నారు. ఈ మొటిమల వలన అందంగా ఉండేవారు కూడా అందహీనంగా కనిపిస్తారు.. ఈ మొటిమలను తగ్గించుకోవడానికి వివిధ రకాల క్రీములను వాడుతుంటారు. కొంతమందికి కొన్ని క్రీమ్స్ వలన మొటిమలు తగ్గిపోతాయి. మరికొందరికి ఎంత ప్రయత్నించిన ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్ లు వాడిన మొటిమలు అనేవి పోవు. అలాగే ముఖం కూడా జిడ్డు ఉంటుంది. అలాంటివారు కొన్ని చిట్కాలను పాటిస్తే ముఖం మొటిమలు లేకుండా అందంగా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జిడ్డు లేకుండా చర్మం నిగనిగలాడుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు బయటినుంచి ఇంటికి రాగానే ముఖాన్ని సబ్బుతో తప్పనిసరిగా కడుక్కోవాలి. చాలామంది మొటిమలు,ట్యాన్ లాంటివి వస్తూ ఉంటాయి. చర్మం లో మొటిమలు, మచ్చలు మరియు ఇతర చారలను కప్పిపుచ్చడానికి లేయర్స్ లేయర్స్ గా మేకప్ వేసుకోవడం కాదు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారాలు, పానీయాలు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మం సున్నితంగా ఉంటే మొటిమలు తొందరగా వస్తాయి. అందుకే చర్మ సంబంధ ఉత్పత్తులను కొనేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొటిమలు వచ్చే చర్మం చాలా వరకు జిడ్డు చర్మం అయి ఉంటుంది. అలాంటివాళ్లు ఆయిల్ ఫ్రీ ప్రోడక్ట్ ను ఎంచుకోవాలి. ఆయిల్ ఉత్పత్తులను వాడితే అవి చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దీనివలన మొటిమలు ఎక్కువగా వస్తాయి.
ముఖాన్ని స్క్రబ్ చేయడం వలన ముఖంపై ఉండే జిడ్డు, చర్మం మీది మలినాలు తొలగించబడతాయి. నల్లబడిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు ఉన్నప్పుడు స్క్రబ్ చేయకూడదు. ఇలా చేస్తే మొటిమలు ఎక్కువ అవుతాయి. అలాగే ముఖాన్ని పదే పదే కడగకూడదు. ఇలా చేస్తే మొఖం పొడిబారుతుంది. మొటిమలు తగ్గటానికి వాడే ప్రొడక్ట్స్ లలో పాలీసిక్ ఆసిడ్ లేదా బెంజైల్ ఫెరాక్సైడ్ మిశ్రమం ఉండేలా చూసుకోవాలి. చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్లను ఎంచుకోవాలి. మొటిమలు వచ్చినప్పుడు కొంతమంది ఎక్కడెక్కడో ఉన్న చిట్కాలు అన్ని ప్రయోగిస్తుంటారు. పూర్తిగా తెలియకుండా చర్మం మీద ఏవి పడితే అవి రాయకూడదు. అలాగే మేకప్ ను కూడా ఎక్కువగా వేసుకోకూడదు. వీటి వలన మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా చర్మం సహజ మెరుపును కోల్పోతుంది.